
తలైవా రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జైలర్ 2'. సుమారు మూడేళ్ల క్రితం వచ్చి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన 'జైలర్' సినిమాకు ఇది సీక్వెల్. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన నెల్సన్ కుమారే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో రిలీజైన 'జైలర్ 2' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇప్పటికే జైలర్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే తమిళంలో 1000 కోట్ల కలెక్షన్లు సాధించిన మొదటి సినిమాగా రజనీకాంత్ జైలర్ 2 నిలుస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ యాక్ట్ ఉన్నారు. రమ్యకృష్ణ, విద్యాబాలన్ మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు, యోగిబాబు, మిర్నా మేనన్, రిత్విక్.. ఇలా ఎంతో మంది వివిధ పాత్రలు పోషించారు.

కాగా జైలర్, జైలర్ 2 సినిమాల్లో రజనీకాంత్ కోడలిగా నటించి మెప్పించింది మిర్నా మీనన్. మలయాళం సినిమా ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ మలయాళంతో పాటు ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాల్లోనే నటిస్తోంది. తెలుగులో క్రేజీ ఫెలో, ఉగ్రం, నా సామిరంగ తదితర సినిమాల్లో హీరోయిన్ గా, సెకెండ్ హీరోయిన్ గా చేసిందీ అందాల తార.

ఇక జైలర్, జైలర్ 2 సినిమాల్లో రజనీకాంత్ కోడలిగా శ్వేత పాత్రలో చాలా సెటిల్డ్ గా నటించి అందరి మన్ననలు అందుకుంది మిర్నా మీనన్. ఇక సోషల్ మీడియాలోనూ ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్, పాపులారిటీ ఉంది.

కాగా సినిమాల్లో ఎక్కువగా ట్రెడిషినల్ పాత్రల్లోనే కనిపించే మిర్నా మీనన్ సోషల్ మీడియాలో మాత్రం చాలా గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి కూడా లైకులు, షేర్లు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.