
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘డోరతి’ (Dorothy) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సనత్, రిషికాంత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యేక ప్రశంసలను అందుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘డోరతి’ చిత్రాన్ని వీక్షించిన తలైవా రజనీకాంత్ సినిమాలోని ప్రతి అంశాన్ని అభినందించడమే కాకుండా, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌ను స్వయంగా అభినందించడం విశేషం.

సినిమా చూసిన అనంతరం రజనీకాంత్ “ఫాంటాస్టిక్, బ్యూటిఫుల్, మైండ్‌బ్లోయింగ్!” అంటూ ప్రశంసల జల్లు కురిపించినట్లు సమాచారం. ముఖ్యంగా “నాకు కావలసిన కార్తీక్ సుబ్బరాజ్ ఇతనే” అంటూ ఆయన చెప్పిన మాటలు తన జీవితంలో ఎప్పటికీ మరువలేని మధుర జ్ఞాపకమని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. రజనీకాంత్ నుంచి వచ్చిన ఈ అరుదైన ప్రశంసలతో చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో ఉత్సాహంలో ఉన్నారు.

మరోవైపు, ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న యువ నటుడు రిషికాంత్ తన 15 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణం గురించి స్పందిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ‘డోరతి’తో పాటు ఇటీవల విడుదలైన ‘మొద రాత్రి’ చిత్రాలకు వస్తున్న ఆదరణ చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో సరైన గుర్తింపు కోసం గత 15 ఏళ్లుగా తాను పడిన కష్టాలు, ఎదురుచూపులు, నిరాశలను గుర్తుచేసుకున్నారు

సమాజంలోని సున్నితమైన అంశాలు, వివక్ష, హృదయాన్ని పిండేసే మానవీయ సంబంధాల నేపథ్యంతో సాగే ఈ కథ ప్రేక్షకులను తీవ్రమైన భావోద్వేగానికి గురిచేస్తుంది. సినిమాలో వచ్చే ప్రతీ సన్నివేశం సీన్ బై సీన్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా దర్శకుడు రూపొందించారు. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత నటుడు రిషికాంత్‌కు ఈ సినిమా తెచ్చిపెట్టిన గుర్తింపు, ప్రేక్షకుల ఆదరణ ఆయనను ఎంతో భావోద్వేగానికి గురిచేసింది. ప్రాణ స్నేహితుడు ట్రాన్స్ జెండర్ అయితే తనకు సమాజంలో వచ్చే అవమానాలు, కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు.

ప్రస్తుతం ఈ మైండ్‌బ్లోయింగ్ ఎమోషనల్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటూ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్, స్క్రీన్ ప్లే , బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని మరింత పెంచాయని, ఓటీటీలో ఈ కంటెంట్ కచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడదగ్గ మాస్టర్‌పీస్ అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. వీకెండ్లో మంచి ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ డ్రామా చూడాలనుకునే వారికి ఈ ‘డోరతి’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్!