
2016లో కింగ్ నాగార్జున నటించిన ఊపిరి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పూజిత పొన్నాడ. ఆ తర్వాత అక్కినేని హీరో నాగ చైతన్య ప్రేమమ్ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది. ఈ రెండు సినిమాల్లో తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది పూజిత.

కాగా పూజితకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏదంటే రామ్ చరణ్ రంగస్థలం అనే చెప్పాలి. ఇందులో హీరో ఆది పినిశెట్టి ప్రియురాలు పద్మ పాత్రలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. సినిమాలో కనిపించింది కొంత సేపే అయినా తన నటనతో ఆకట్టుకుంది పూజిత. రంగస్థలం సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు.

ఆ తర్వాత రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, కల్కి, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, రన్, మిస్ ఇండియా, కథ కంచికి మనం ఇంటికి, ఓదెల రైల్వే స్టేషన్ తదితర సినిమాల్లో నటించింది పూజిత. అలాగే రవితేజ రావణాసుర సినిమాల్లో మరో కీలక పాత్ర పోషించింది.

అయితే ఎందుకోకానీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం రావడం లేదు. వరుసగా సినిమాలు చేస్తునా.. అందం అభినయం రెండూ ఉన్న కూడా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రావడంలేదు.

ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో పూజిత కూడా కనిపించింది. ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఈ భామ. అలాగే ఓ తమిళ సినిమాలోనూ నటిస్తోందీ అందాల తార. తాజాగా సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలను పంచుకుంది.