Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ అడుగు జాడల్లోనే.. అనాథ పిల్లలతో అనా కొణిదెల క్రిస్మస్‌ సంబరాలు.. ఫొటోస్‌ చూశారా?

Updated on: Dec 25, 2023 | 9:58 PM

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సతీమణి అనా కొణిదెల తన మంచి మనసును చాటుకున్నారు. స్థానికంగా ఉండే ఓ అనాథ శరణాలయానికి వెళ్లిన ఆమె అక్కడి పిల్లలతో కలిసి క్రిస్మస్‌ సంబరాలు చేసుకున్నారు. పిల్లలతోనే కేక్‌ కటింగ్‌ చేయించి అందరికీ పంచారు.

1 / 5

2 / 5
హైదరాబాద్‌ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్‌ ఫర్‌ ద చిల్డ్రన్‌లోని చిన్నారులతో అనా కొణిదెల క్రిస్మస్‌ సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఎంతో సరదాగా గడిపారామె. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

3 / 5
 అనంతరం చిన్నారులతో కలిసి క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచారు. అలాగే పిల్లలకు అవసరమైన నిత్యావసర సరుకులను అనాథశరణాలయానికి అందజేశారు.

4 / 5
ఈ సందర్భంగా జీవోదయ హోమ్‌ ఫర్‌ ద చిల్డ్రన్‌ నిర్వాహకులు అనా కొణిదెలను ఘనంగా సన్మానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది. దీంతో ఈ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి.

5 / 5
 మరోవైపు క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు పవన్‌ కల్యాణ్‌. సామాజిక విలువలు చైతన్యవంతం కావాలంటే క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం సర్వదా ఆచరణీయమని జనసేన అధినేత పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us