
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకుల కంటెంట్ అభిరుచి పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో చూడలేని సస్పెన్స్, థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామాలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో చూసేందుకు యూత్ బాగా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే బోల్డ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ‘పాంచాలి’ (Panchali) మూవీ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ మూవీకి నెట్టింట తెగ రెస్పాన్స్ వస్తుంది.

ఆధునిక సమాజంలోని ఓ విచిత్ర సాంప్రదాయాన్ని జోడించి ఈ కథను రూపొందించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు భూమి (అనుప్రియ గోయెంకా) అనే ఒకే మహిళను వివాహం చేసుకుంటారు. అయితే నగరంలో చదువుకుని ఆధునిక ఆలోచనలు ఉన్న ఐదో తమ్ముడు మాత్రం ఈ పురాతన సాంప్రదాయాన్ని పాటించడానికి తీవ్రంగా తిరస్కరిస్తాడు. ఆ ఐదో తమ్ముడిని కూడా తన వలలో వేసుకుని ఐదో భర్తగా మార్చుకోవడానికి ఆ మహిళ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? ఆ కుటుంబం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ సాగుతుంది.

ఇందులో బాలీవుడ్ నటి అనుప్రియ గోయెంకా తో పాటు ఆమన్ వర్మ, అవినాష్ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించారు. కథలోని బోల్డ్ సీన్స్, ఉత్కంఠ రేకెత్తించే ట్విస్టులు ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంటున్నాయి. సుమారు 1 గంట 40 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి కాకుండా ఒంటరిగా చూడటమే శ్రేయస్కరమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆత్రంగి, ఆల్ట్రా ప్లే వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ డ్రామా స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ కంటెంట్ , బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్స్ కోరుకునే వారికి ఇది ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తోంది. దీనిని దీపక్ పాండే తెరకెక్కించారు. విబు అగర్వాల్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌కి అమితాభ్ మిత్ర రచయితగా వ్యవహరించారు.

నటి అనుప్రియ గోయెంకా తన బోల్డ్ , ఎమోషనల్ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కథలో కాస్త సస్పెన్స్, డ్రామా కూడా ఉండటంతో ఓటీటీ ఆడియన్స్‌ను ఇది బాగానే ఆకట్టుకుంది. IMDb లో దీనికి మిశ్రమ స్పందన (4.7/10 రేటింగ్) లభించింది. కొత్త కొత్త కంటెంట్ చిత్రాలను చూడాలనుకునేవారు ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎంపిక చేసుకుంటున్నారు.