Prabhu Deva : ఉదయం ఓట్స్, రాత్రి సలాడ్.. ఆకలి వేసినప్పుడు ఏం చేస్తానంటే.. డైట్ సీక్రెట్ చెప్పిన ప్రభుదేవా..

Updated on: Oct 22, 2026 | 5:20 PM

కొరియోగ్రాఫర్, నటుడిగా, దర్శకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు ప్రభుదేవా. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తెరపై అంతగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన వయసు 53 సంవత్సరాలు. ఇప్పటికీ ఆయన ఫిట్నెస్, లుక్స్ లో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో తాజాగా ఫిట్నెస్, డైట్ సీక్రెట్ రివీల్ చేశారు. తాను వరుసగా మూడు రోజులు డైట్‌లో ఉండి, నాలుగో రోజు తినడం మొదలుపెడతానని అన్నారు.

1 / 5
భారతీయ సినీ ప్రియులు 'ఇండియన్ మైఖేల్ జాక్సన్' అని పిలుచుకునే నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. ప్రస్తుతం ఆయన వయసు 53 సంవత్సరాలు. ఇప్పటికీ యంగ్ హీరోలకు ధీటుగా తన ఫిట్నెస్ తో ఆశ్చర్యపరుస్తుంటారు. అందుకే ఆయన ఫిట్నెస్ వెనుక రహస్యం తెలుసుకోవాలని ట్రై చేస్తుంటారు చాలా మంది. తాజాగా తన డైట్ సీక్రెట్ వెల్లడించారు. తన శరీరాన్ని తేలికగా, శక్తివంతంగా ఉంచుకోవడానికి ఆహారంలో మార్పులు చేసుకుంటానని ప్రభుదేవా చెబుతున్నారు.

2 / 5
ఒక ఇంటర్వ్యూలో ప్రభుదేవా తన ఆహారపు అలవాట్ల గురించి ఇలా చెప్పారు: "నా ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి. కొంతకాలం క్రితం, నేను మూడు రోజులు డైట్ పాటించి, నాలుగో రోజు తినేవాడిని. కానీ ఇప్పుడు ఉదయం పూట ఓట్స్, జ్యూస్ తాగుతున్నాను. మధ్యాహ్న భోజనంలో మామూలుగా తినే అన్నం మానేశాను. దానికి బదులుగా, రెండు చెంచాల మాప్పిళై సాంబ బియ్యం, కుతిరవలి (సాంప్రదాయ జొన్న) తింటున్నాను" అని అన్నారు.

3 / 5
 రాత్రి 7 గంటల లోపే భోజనం ముగిస్తాను. అందులో ఎక్కువగా సలాడ్ ఉంటుంది. ఇంకా ఆకలిగా ఉంటే, రెండు ఇడ్లీలు తింటాను. బహుశా ఈ ఆహారపు అలవాటే నన్ను ఇంత చురుకుగా ఉంచుతుందేమో" అని చెప్పుకొచ్చారు. బరువు నియంత్రణకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి తీవ్రమైన ఆహార నియమాల కంటే మితమైన సమతుల్య ఆహారం తీసుకోవడమే ముఖ్యమని డైటీషియన్ గరిమా గోయల్ సూచిస్తున్నారు. ప్రభుదేవా ఆహార నియమాలలోని పోషక ప్రయోజనాలను, అలాగే గమనించవలసిన విషయాలను వివరించారు.

4 / 5
ఉదయం పూట ఓట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో ఉండే బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగించి, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ, మీ అల్పాహారంలో పాలు, పెరుగు, నట్స్ లేదా విత్తనాల వంటి ప్రోటీన్ వనరులను కూడా చేర్చుకుంటే, అది మరింత సమతుల్యంగా ఉంటుంది.  పండ్ల రసాల కంటే, ఫైబర్ పొందడానికి , ఆకలిని నియంత్రించడానికి పండ్లను పూర్తిగా తినడం ఉత్తమమని ఆమె అన్నారు.

5 / 5
సాంప్రదాయ ధాన్యాలు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్, సూక్ష్మపోషకాలను అందిస్తాయి. అయితే, కేవలం పరిమాణాన్ని తగ్గించడంపైనే కాకుండా, వాటితో పాటు తగినంత ప్రోటీన్, కూరగాయలు, మంచి కొవ్వులను కూడా చేర్చుకోవడం ముఖ్యమని గోయల్ తెలిపారు. రాత్రి భోజనంలో సలాడ్, ఇడ్లీ తినడం వల్ల కేలరీలు తగ్గించుకోవచ్చు.  రాత్రి భోజనంలో సాంబార్, పప్పు, పెరుగు చేర్చుకోవడం పోషకాహార సమతుల్యతను నిర్ధారిస్తుంది. రాత్రి 7 గంటల లోపు భోజనం చేయడం వల్ల రాత్రిపూట అనవసరమైన కోరికలను కంట్రోల్ చెయ్యొచ్చు. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో తీసుకునే మొత్తం కేలరీలు, ఆహార నాణ్యత, శారీరక శ్రమ, నిద్ర , క్రమబద్ధత కీలక పాత్ర పోషిస్తాయని ఆమె అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us