హమ్మయ్యా..! పైకి చెప్పట్లేదు కానీ ఎన్టీఆర్ అభిమానుల ఇన్నర్ ఫీలింగ్ ఇదే ఇప్పుడు. ఎన్నో రోజుల నుంచి ప్రశాంత్ నీల్ సినిమా ఉందంటున్నారు కానీ దీనిపై అప్డేట్స్ లేవు. అసలు ఓ టైమ్‌లో ఉందో ఆగిందో అనే డౌట్స్ వచ్చాయి కూడా.
అన్నింటికీ సమాధానం ఇప్పుడొచ్చింది. పూజ అయితే చేసారు.. మరి రెగ్యులర్ షూట్ ముచ్చటేంటి..? మిగిలిన సినిమాల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు.? దేవర షూటింగ్‌తోనే కొన్ని రోజులుగా బిజీ బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్.
ఈ చిత్ర షూటింగ్ పూర్తైన తర్వాత కానీ వార్ 2 వైపు వెళ్లకూడదని ఫిక్సయ్యారు. సెప్టెంబర్ 27న దేవర విడుదల కానుంది. రెండో భాగం షూటింగ్‌పై ఇంకా క్లారిటీ అయితే లేదు.. మరోవైపు వార్ 2 కూడా 2025 ప్రథమార్థంలోనే విడుదల కానుంది.
ఈ రెండింటిపైనే తారక్ ఫోకస్ ఉందిప్పుడు. దేవర, వార్ 2తోనే బిజీగా ఉన్న తారక్.. తాజాగా ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మొదలు పెట్టారు. అప్పుడెప్పుడో ట్రిపుల్ ఆర్ విడుదలకు ముందే నీల్ సినిమాపై ప్రకటన వచ్చింది.
గతేడాది తారక్ బర్త్ డేకు ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఆ తర్వాత దానిపై అప్డేట్స్ లేవు. అసలుంటుందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఎందుకంటే సలార్ 2తో పాటు కేజియఫ్ 3 ప్రశాంత్ లైనప్‌లో ఉన్నాయి కాబట్టి.
సలార్ 2 తర్వాతే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుందా లేదంటే దానికంటే ముందే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకొస్తారా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా దేవర 2ను పూర్తి చేయాలి.
మరోవైపు సలార్ 2 కంటే ముందే మారుతి, హను రాఘవపూడి సినిమాలు.. కుదిర్తే సందీప్ వంగా స్పిరిట్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు. ప్రభాస్ ఒకవేళ అక్కడ లాక్ అయితే.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు లైన్ క్లియర్ అయినట్లే.
దేవర 2తో పాటు నీల్ సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేస్తారు జూనియర్. జనవరి 9, 2026న తారక్, నీల్ సినిమా రిలీజ్ కానుంది. ఇది జరగాలంటే 2025లోనే షూట్ మొదలు కావాలి. మొత్తానికి చూడాలిక.. ఈ ఇద్దరి ప్లానింగ్ ఎలా ఉండబోతుందో.?