
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.

ఆతర్వాత అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను సినిమాలో నటించి మెప్పించిది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఆతర్వాత ఈ అమ్మడు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అందాలు ఆరబోసి అదరగొట్టింది.

ఆ తర్వాత ఈ అమ్మడు సాలిడ్ హిట్ అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తుంది హాట్ బ్యూటీ నిధి.

హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది నిధి. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.