
టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు నయనతార. ఈ అందాల భామ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తమిళ్, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఈ అందాల తార ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ నటించి మెప్పించింది నయన్.

టాలీవుడ్ అగ్ర హీరోలందరితో పని చేసింది నయన్. చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’, ‘గాడ్ ఫాదర్’ , రీసెంట్ బ్లాక్ బస్టర్ 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాల్లో నటించగా, నందమూరి బాలకృష్ణతో ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి సూపర్ హిట్లు అం దుకుంది. అలాగే వెంకటేష్ సరసన ‘లక్ష్మి’, ‘తులసి’, ‘బాబు బంగారం’ వంటి సినిమాల్లో మెరిసింది ఈ స్టార్ హీరోయిన్ .

అలాగే కింగ్ నాగార్జునతో ‘బాస్’, ‘గ్రీకువీరుడు’ చిత్రాల్లో నటించారు. ఇక ఎన్టీఆర్ తో అదుర్స్, అలాగే ప్రభాస్ తో యోగి సినిమాల్లో నటించిన నయనతార.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాత్రం ఇప్పటి వరకు ఆమె ఒక్క ఫ్రేమ్ లో కూడా కనిపించలేదు. నిజానికి మహేష్ బాబు, నయనతార కాంబినేషన్లో సినిమా రావడానికి కొన్నిసార్లు చర్చలు జరిగాయని టాలీవుడ్ టాక్.

గతంలో మహేష్ నటించిన కొన్ని భారీ చిత్రాల్లో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా నయనతారనే సంప్రదించారట. అయితే ఆ సమయంలో ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడం లేదా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఆ అవకాశాలు చేజారిపోయాయని తెలుస్తోంది. అలాగే నయనతార కూడా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకే మొగ్గు చూపుతుండటంతో, మహేష్ బాబు కమర్షియల్ సినిమాల్లో ఆ విధమైన పాత్రలు కుదరక ఆ కాంబినేషన్ సెట్ కాలేదని మరికొందరి అభిప్రాయం.

గతంలో ఓ ఇంటర్వ్యూలో నయన్ మాట్లాడుతూ.. మహేష్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ రాలేదని.. ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తా అని తెలిపింది. ప్రస్తుతం మహేష్ వారణాసి సినిమాలో బిజీగా ఉన్నాడు. అలాగే నయన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. మరో ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి.