
సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్, స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 40 ఏళ్లు దాటినా హీరోయిన్ గా బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార. వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ నిస్తోంది

ఇటీవలే యశ్ నటించిన టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది నయనతార. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఉన్నంతలో నయనతార పాత్రకు మంచి పేరే వచ్చింది.

ఇక టాక్సిక్ సినిమాకు భిన్నంగా హాయ్ అనే రొమాంటిక్ లవ్ స్టోరీలో హీరోయిన్ గా నటించింది నయనతార. కెవిన్ ఇందులో హీరోగా నటించాడు. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ లవ్ స్టోరీ ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతోంది

సినిమాల సంగతి పక్కన పెడితే.. తాజాగా తన ఇద్దరు పిల్లలు ఉలగం, ఉయిర్ ల నాలుగో పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది నయనతార. జంగిల్ థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈ బర్త్ డే పార్టీలో ఇద్దరు పిల్లలు ఎంతో క్యూట్ గా కనిపించారు.

ఈ సందర్భంగా భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి పిల్లలతో కేక్ కటింగ్ చేయించింది నయనతార. అనంతరం ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిందీ లేడీ సూపర్ స్టార్. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా నయనతార చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. మూకుతి అమ్మన్ 2( తెలుగులో అమ్మోరు తల్లి), డియర్ స్టూడెంట్స్ తదితర సినిమాల్లో నటిస్తోందీ లేడీ సూపర్ స్టార్. దీంతో పాటు బాలీవుడ్ లోనూ ఓ స్టార్ హీరో సరసన స్క్రీన్ షేర్ చేసుకోనుంది నయన్.