
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వరుస విజయాలతో జోరు మీదున్న నాని ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు నాని. వాల్ పోస్టర్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు నాని. ఇటీవలే కోర్ట్ సినిమాను నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

నాని సినిమా కోసం ఆడియన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. నాని సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటాయి. అది ఏ జోనర్ సినిమా అయినా నాని సినిమా అంటే చాలు ఫ్యాన్ థియేటర్స్ కు క్యూ కడతారు. ఇక దసరాలాంటి మాస్ మసాలా సినిమా తర్వాత హాయ్ నాన్నలాంటి ఫ్యామిలీ సినిమాతో కట్టిపడేసాడు.

దసరా సినిమా నుంచి నాని వరుసగా హిట్స్ కొడుతున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో ప్రేక్షకులను అలరించారు నాని. ఇక ఇప్పుడు ది ప్యారడైజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో శ్రీకాంత్ ఓదెల నానితో కలిసి దసరా అనే సినిమా చేశారు. ఆ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా భారీ విజయాన్ని అందుకుంది.

ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో నాని జోడిగా కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నాని మాట్లాడుతూ.. నాకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం అని తెలిపాడు నాని. శ్రీదేవిని నేను ఎంతగానో ఆరాధించా.. శ్రీదేవి, వెంకటేష్ నటించిన క్షణక్షణం సినిమా ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు అన్నారు నాని. లక్షసార్లు చూసినా మళ్లీ చూడాలనిపించే సినిమా అది. అసలు శ్రీదేవి అంత అందంగా ఉన్నారో ఇప్పటికీ నాకు అర్ధంకావడం లేదు.. ఆ సినిమాకే శ్రీదేవి అందం తీసుకొచ్చారు అని అన్నారు.