
ఓటీటీలో ఎన్నో రకాల థ్రిల్లర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. శుక్రవారం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. బాబాయ్ ఈ సినిమా చూడాలంటే 18+ అయ్యుండాలి.. ఊహించని ట్విస్ట్ లతో మైండ్ పోతుంది ఈ సినిమా చూస్తుంటే..

షైనీ అనే మహిళ తన భర్త ఇంట్లో అత్తమామలతో కలిసి ఉంటుంది. ఆమె అత్త మంచానికే పరిమితమై ఉండటంతో, చాలా సంవత్సరాలుగా ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత షైనీ మీదే పడుతుంది. ఈ రొటీన్ బోరింగ్ జీవితంతో విసిగిపోయిన షైనీకి కిరణ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఈ ఇద్దరూ సీక్రెట్ గా కలుసుకుంటూ ఉంటారు.

అయితే ఒక రోజు షైనీ, కిరణ్ సహాయంతో తన అత్తను చంపాలని ప్లాన్ వేస్తుంది. అనుకున్నట్టుగానే ఇద్దరూ కలిసి ఆమెను హత్య చేస్తారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు ఊహించని విధంగా మారిపోతాయి. అయితే షైనీ మామగారికి కళ్లు కనిపించవు. అతనికి వినికిడి సమస్య కూడా ఉంటుంది. కానీ తన భార్యను షైనీ, కిరణ్ సత్య చేశారని తెలిసిపోతుంది.

షైనీ మామ అయిన కుట్టిచాయన్ వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. దాంతో సినిమా ఉహించాని మలుపు తిరుగుతుంది. అసలు అతను వారిని ఎలా పట్టుకున్నాడు. వారిపై ప్రతీకారం తీర్చుకున్నాడా.? కళ్ళు కనిపించని ఆ ముసలి వ్యక్తి వారిని ఏం చేశాడు అన్నది సినిమాలోనే చూడాలి. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ తోపాటు డార్క్ థ్రిల్లింగ్ సీన్స్ కూడా ఉంటాయి.

ఈ సినిమా పేరు ఉడల్.. మలయాళంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అద్నుబాటులో ఉంది. ఈ సినిమాలోని ప్రతి సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక రొమాంటిక్ అండ్ డార్క్ నెస్ ఎక్కువ గా ఉండటంతో పాటు రక్తపాతం కూడా ఉంటుంది. కాబట్టి 18 ఏళ్లు నిండిన వారే ఈ సినిమా చూడాలి. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.