ఓటీటీని షేక్ చేస్తున్న సిరీస్.. ఒక్కసారి మొదలుపెడితే ఆపలేరు.. అస్సలు మిస్ చేసుకోవద్దు

Updated on: Sep 19, 2026 | 1:57 PM

ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో కంటెంట్‌కు కొదవే లేదు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఓటీటీలో చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుండగా.. మరోవైపు రియల్ లైఫ్ సంఘటనలు, చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది.

1 / 5
ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో కంటెంట్‌కు కొదవే లేదు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఓటీటీలో చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుండగా.. మరోవైపు రియల్ లైఫ్ సంఘటనలు, చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా వార్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లకు ఓటీటీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

2 / 5
అలాంటి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ వెబ్ సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ది కార్గిల్ వార్’. 1999 కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం చేపట్టిన కీలక ఆపరేషన్ ‘సఫేద్ సాగర్’ నేపథ్యంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఆగస్టు 7, 2026న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. 1999లో కార్గిల్ యుద్ధం తీవ్ర రూపం దాల్చిన సమయంలో, అత్యంత క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లో భారత సైన్యానికి మద్దతుగా భారత వైమానిక దళం కీలక పాత్ర పోషించింది.

3 / 5
అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ చేపట్టిన ఈ వైమానిక చర్యకు ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ అనే పేరు వచ్చింది.ఈ సిరీస్ ప్రధానంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ‘గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్ చుట్టూ తిరుగుతుంది. శత్రు ప్రాంతాల్లోకి వెళ్లి ప్రమాదకరమైన మిషన్లను పూర్తి చేయాల్సిన పైలట్ల సాహసాలు, వారికి ఎదురైన సవాళ్లు, యుద్ధ సమయంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, అలాగే వారి వ్యక్తిగత జీవితాల్లోని భావోద్వేగాలను కూడా సిరీస్‌లో చూపించారు.  

4 / 5
ఈ సిరీస్‌లో నటుడు సిద్దార్థ్ ఫ్లైట్ కమాండర్ అజయ్ అహుజా పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, దియా మిర్జా, ప్రజక్తా కోలి, అదిల్ హుస్సేన్, మిహిర్ అహుజా, తారుక్ రైనా, అర్వణ్ భాసిన్, అమృత బాగ్చి తదితరులు కీలక పాత్రలు పోషించారు. జిమ్మీ షెర్గిల్ బి.ఎస్. ధనోవా పాత్రలో నటించగా, అభయ్ వర్మ రాజ్‌పాల్ సింగ్ ధాలీవాల్ పాత్రలో కనిపించారు. కథలో యుద్ధ రంగంతో పాటు సైనికుల వ్యక్తిగత జీవితాలు, కుటుంబ సభ్యుల భావోద్వేగాలను కూడా ప్రాధాన్యంగా చూపించారు.

5 / 5
ఆపరేషన్ సఫేద్ సాగర్’కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశాల్లో షూటింగ్ విధానం కూడా ఒకటి. సిరీస్‌ను రూపొందించే సమయంలో భారత వైమానిక దళానికి చెందిన మాజీ అధికారుల నుంచి విస్తృతంగా సమాచారం, సలహాలు తీసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. అంతేకాదు, నిజమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లు, విమానాలు, మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తూ సిరీస్‌ను మరింత వాస్తవికంగా తెరకెక్కించారు. హై-ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లోని క్లిష్టమైన పరిస్థితులను తెరపై చూపించేందుకు ప్రత్యేకంగా శ్రమించారు. నెట్‌ఫ్లిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, షూటింగ్ సమయంలో 16,000 అడుగుల ఎత్తులో తీవ్ర చలికాల పరిస్థితుల్లో కూడా చిత్రీకరణ జరిగింది. 

Loading...
Unable to load recommendations.
Follow Us