
ఓటీటీలు వారం వారం రకరకాల సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షోలు స్ట్రీమింగ్ అలరిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాలకే ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక ఓటీటీలో సినిమాలు చూడటానికే ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. రొమాంటిక్, హారర్, థ్రిల్లర్ తరహా సినిమాలు చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ రొమాంటిక్ సిరీస్ ఓటీటీని షేక్ చేస్తున్నాయి. ఆ సినిమా ఏంటంటే.. ఓటీటీలో దూసుకుపోతున్న ఆ రొమాంటిక్ సిరీస్ ఎదో కాదు పాంచాలి. ఇదొక రొమాంటిక్ డ్రామా.ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి అసలు చూడలేరు. ఐదుగురు భర్తలు ఉన్న స్త్రీ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఐదుగురు అన్నాదమ్ములు.. అందరూ ఒకే స్త్రీని వివాహం చేసుకుంటారు.

మహాభారతంలోని ద్రౌపతి పాత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 2019లో వచ్చిన ఈ తమిళ సిరీస్ లో టాలీవుడ్ హీరోయిన్ అనుప్రియ గోయెంకా ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో ఆమె నటిగా ప్రశంసలు అందుకుంది. ఒకొక్క ఎపిసోడ్ సుమారు గంట 40 నిమిషాలు మాత్రమే రన్ టైమ్ ఉన్న ఈ పాంచాలి సిరీస్ ఇప్పుడు అల్ట్రా ప్లే ఓటీటీ యాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ప్రైమ్ వీడియోలోనూ అందుబాటులో ఉంది.

ఐఎమ్‌డీబిలో కూడా 8.7 రేటింగ్ సొంతం చేసుకుంది ఈ సిరీస్. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. నలుగురు అన్నదమ్ములు ఒకే స్త్రీని (భూమి) వివాహం చేసుకుంటారు. సిటిలో ఉండే తమ తమ్ముడిని సైతం తమ భార్యనే వివాహం చేసుకోవాలని కండిషన్ పెడతారు. అందుకు అతడు అంగీకరించడు.

అయితే ఒకరోజు తమ ఇంట్లో పూజ గదిలోని దేవుడి విగ్రహం నుంచి రక్తం రావడాన్ని గమనిస్తారు. దీంతో తమ తమ్ముడు భూమిని పెళ్లి చేసుకోకపోవడంతోనే ఇలా జరుగుతుందని అంటారు. చివరకు ఏం జరిగింది.. ? తన మరిదిని భూమి ఐదో భర్తగా పెళ్లి చేసుకుందా ? అనేది సినిమా.. ఈ సినిమాను ఒంటరిగా చూడటమే బెటర్. ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.