
తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయిక మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా రాణిస్తుంది. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ హర్యానా భామ.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది. అందంతో పాటు నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస అవకాశాలను అందుకుంటోంది. మీనాక్షి చౌదరి సినీ ప్రయాణం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో ప్రారంభమైంది.

అయితే అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘హిట్: ది సెకండ్ కేస్’ మూవీ ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఈ సినిమా తర్వాత మీనాక్షికి టాలీవుడ్‌లో వరుస అవకాశాలు రావడం మొదలైంది. పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. రీసెంట్ గా మీనాక్షి నటించిన సినిమాల్లో కొన్ని మంచి విజయాలను అందుకోవడంతో ఆమెకు ఇండస్ట్రీలో డిమాండ్ మరింత పెరిగింది. ముఖ్యంగా ‘గుంటూరు కారం’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలు ఆమె కెరీర్‌కు మరింత బలాన్ని ఇచ్చాయి.

సంక్రాంతి సీజన్‌లో వచ్చిన సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన మీనాక్షి.. వరుస విజయాలు అందుకుంటున్న హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మీనాక్షి చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా పైన కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నేచురల్ స్టార్ నాని, ‘ఓజీ’ ఫేమ్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో ఓ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నాని కెరీర్‌లోనే విభిన్నమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు దర్శకుడు సుజీత్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పుడు హీరోయిన్ విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో, ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో నానికి జోడీగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసే విషయంపై చిత్ర బృందం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాబట్టి మీనాక్షి నిజంగానే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందా లేదా అన్నది అధికారికంగా వెల్లడయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఈ కాంబినేషన్ ఖరారైతే మాత్రం నాని–మీనాక్షి జోడీపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం ఖాయం.