
మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న ముద్దుగుమ్మ మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ సుందరిగా తన కంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిన్నది సినిమాల పరంగా మాత్రం అంతగా సక్సెస్ అవ్వలేక పోతుంది. అవకాశాలు వచ్చినా, ఈ బ్యూటీకి సరైన హిట్ మాత్రం లేకపోయింది.

అందం ఉన్నా అదృష్టం లేని బ్యూటీ అంటే, ఈ ముద్దుగుమ్మను నిర్వచనంగా చెప్పవచ్చు. ఈ అమ్మడు ప్రపంచ సుందరిగా రికార్డ్ క్రియేట్ చేసిది. తర్వాత ఏకంగా బాలీవుడ్‌లోకి నటిగా అడుగు పెట్టింది. కానీ ఈ అమ్మడుకు ఇండస్ట్రీలో తన సక్సెస్ కొనసాగించడంలో మాత్రం విఫలం అవుతుంది.

అవకాశాలు వచ్చినప్పటికీ ఒక్క సినిమా కూడా సరైన హిట్ అందుకోక పోవడంతో, ప్రస్తుతం ఈ బ్యూటీకి అవకాశాలు రావడమే కష్టమై పోయాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో హిందీ వెండితెర పైకి అడుగు పెట్టింది.

తర్వాత ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అంటూ పలు సినిమాల్లో నటించింది. కానీ ఈ ముద్దుగుమ్మ నటించిన చాలా సినిమాలు మంచి హిట్ అందుకోలేక పోయాయి. ఇక తెలుగులోకి, వరుణ్ తేజ ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇవే కాకుండా పలు సినిమాల్లో నటించినప్పటికీ చాలా సినిమాలు అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు తగ్గాయి.

అయితే సినిమాల ఛాన్స్‌లు లేకపోయినప్పటికీ ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన క్యూట్ అంట్ గ్లామర్ ఫొటోలతో అభిమానుల మనసు దోచుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నది మెరూన్ కలర్ డ్రెస్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.