
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు మనవరాలు, మంచు లక్ష్మి గారాల పట్టి విద్యా నిర్వాణ ఓణీల ఫంక్షన్ ఇటీవల అట్టహాసంగా జరిగినట్లు తెలుస్తోంది.

కేవలం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితుల మధ్యే మంచు లక్ష్మి కూతురు విద్య నిర్వాణ ఓణీల వేడుకను నిర్వహించారు.

మంచు ఫ్యామిలీ అధికారికంగా ఈ విషయాన్నీ చెప్పకపోయినా తాజాగా ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫొటోలు, వీడియోలను చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మంచులక్ష్మీ కూతురు చాలా క్యూట్ గా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే గతంలోలా మంచు లక్ష్మి పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. టీవీ షోలోనూ పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఎక్కవగా ముంబైలోనే ఉంటోన్న ఆమె అప్పుడప్పుడు మాత్రమ హైదరాబాద్ కు వస్తోంది.

గతేడాది దక్ష అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో కనిపించిన మంచు లక్ష్మి.. ఈ ఏడాది బూకీ అనే ఓ తమిళ్/ తెలుగు సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిం