
మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని, నటుడు సంజయ్ స్వరూప్ దంపతుల కుమార్తె జాహ్నవి స్వరూప్ ఇప్పటికే ఒక తెలుగు సినిమాలో నటించిందన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తెస్తూ నెటిజన్లు ఆమె నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణంగా ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోలు రావడం మనం చూస్తుంటాం. కృష్ణ వారసత్వాన్ని పుచ్చుకుని రమేష్ బాబు, మహేష్ బాబు స్టార్‌లుగా ఎదిగారు. ఆ తర్వాత తరం నుంచి సుధీర్ బాబు, నటుడు సంజయ్, మంజుల ఘట్టమనేని సినిమాల్లోకి వచ్చారు.

ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి యంగ్ జనరేషన్ తెరంగేట్రం చేస్తున్నారు. ఓవైపు మహేష్ బాబు అన్న కొడుకు హీరోగా అరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యారు. మరోవైపు మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని కూతురు జాహ్నవి స్వరూప్ సైతం కథానాయికగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఇదివరకే ఆమె చేసిన ఓ యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో హీరోయిన్లకు మించిన అందంతో కట్టిపడేసింది. ఆ తర్వాత సైలెంట్ అయిన ఆమె ఇప్పుడు మరోసారి లేటేస్ట్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది.

తాజాగా బ్లాక్ డ్రెస్ లో సింపుల్ లుక్స్ లో హీరోయిన్లకు మించిన అందంతో కట్టిపడేస్తుంది జాహ్నవి. జాన్వికి కెమెరా పూర్తిగా కొత్తేమీ కాదు. ఆమె 2018లో తన తల్లి దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది' చిత్రంలో బాలనటిగా కనిపించింది. ఆ చిత్రంలో పదేళ్ల వయసులోనే కెమెరా ముందు తన నటనతో ఆకట్టుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మంజుల మాట్లాడుతూ, తమ కుమార్తెలోని ప్రతిభను తాము ముందుగానే గమనించినప్పటికీ, ఆమె ఒక సాధారణ బాల్యాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశ్యంతో, ఆమెను తొందరగా సినిమాల్లోకి నెట్టకూడదని నిర్ణయించుకున్నామని అన్నారు.

ఇప్పుడు ఆమె ఫోటోలు, వీడియోలు చూస్తుంటే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మహేష్ బాబుకు జాహ్నవి అంటే ఎంతో ప్రాణం. షూటింగ్ విరామ సమయంలో ఆమెతో గడిపిన ఫోటోలను మహేష్ గతంలో షేర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జాహ్నవి చదువుపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో ఆమె పూర్తిస్థాయి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది పక్కన పెడితే, చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆమె చేసిన ప్రయత్నాన్ని మహేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.

Jhanavi మొత్తానికి, సూపర్ స్టార్ మేనకోడలు ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిందని తెలిసి నెటిజన్లు "సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో స్టార్ రెడీ అవుతోంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె భవిష్యత్తులో సినిమాల్లోకి రావాలని కోరుకునే వారు కూడా తక్కువేం లేరు. మహేష్ బాబు మేనకోడలు, మంజుల ఘట్టమనేని కూతురు జాన్వీ స్వరూప్ త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. మంజుల తన కూతురు ఫోటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.Stunning