Tamil Stars: తెలుగు మార్కెట్‌ మీద ఫోకస్‌.. ఆ కోలీవుడ్‌ హీరోల ప్లాన్ ఏంటంటే.?

| Edited By: Prudvi Battula

Aug 06, 2024 | 8:30 AM

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి... అనే మాట ఈ జనరేషన్‌కి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. క్రేజ్‌ ఉండగానే క్యాష్‌ చేసుకోవాలని చెప్పి చూడండి... చటుక్కున పట్టేస్తారు. ఆల్రెడీ మన తమిళ హీరోలు పట్టుకున్నట్టు... యస్‌... కోలీవుడ్‌ హీరోలు ఇప్పుడు తెలుగు మార్కెట్‌ మీద ఫోకస్‌ పెంచారు. మొన్న మొన్నటిదాకా స్టార్‌ హీరోల వరకే పరిమితమైన ఈ విషయం... ఇప్పుడు మక్కళ్‌ సెల్వన్‌దాకా చేరింది...

1 / 5
సినిమా సబ్జెక్ట్ కిర్రాక్‌గా ఉంటే ఏ కేరక్టర్‌ అయినా చేయడానికి సిద్ధమన్న విజయ్‌ సేతుపతి, ఆ మధ్య మనసు మార్చుకున్నారు.. ఒన్లీ హీరో రోల్స్ అంటున్నారు. ఆ నిర్ణయం ప్రకటించాక విడుదలైన మహారాజా సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది.

2 / 5
ఇప్పుడు ఆ క్రేజ్‌ని వాడుకుంటున్నారు సేతుపతి. తెలుగులో మార్కెట్‌ని మరింతగా ఎస్టాబ్లిష్‌ చేసుకోవాలన్నదే ఆయన ప్లాన్‌. ఆ మేరకే ప్రెజెంట్‌ ప్రాజెక్టుల పబ్లిసిటీని కూడా డిజైన్‌ చేస్తున్నారట మక్కళ్‌ సెల్వన్‌.

3 / 5
అజిత్‌ అయితే ఇప్పుడు తెలుగు ప్రొడ్యూసర్లతో గుడ్‌బ్యాడ్‌ అగ్లీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను పొంగల్‌ రేసులోకి తీసుకురానున్నారు. మిగిలిన హీరోలతో పోలిస్తే తెలుగు మార్కెట్‌ని మొన్న మొన్నటిదాకా పెద్దగా పట్టించుకోలేదు తల. కానీ, ఏకంగా తెలుగు మూవీ చేస్తూ ట్రేడ్‌ వర్గాలకు ఒక్కసారిగా షాక్‌ ఇచ్చేశారు.

4 / 5
ముందు నుంచీ కాస్త ప్లాన్డ్ గా తెలుగు మార్కెట్‌ని క్యాష్‌ చేసుకుంటున్నారు ధనుష్‌. ఓన్‌ గ్రౌండ్‌ అయిన కోలీవుడ్‌ మీద ఫోకస్‌ పెంచుతూనే, తెలుగులోనూ అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఫస్ట్ అటెంప్ట్ సార్‌తోనే సూపర్‌ సక్సెస్‌ అయిన ఈ హీరో.

5 / 5
ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరలో యాక్ట్ చేస్తున్నారు.  ఇందులో నాగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రష్మిక మందన్న ఈ  సినిమాలో దునుష్ సరసన కథానాయకిగా నటిస్తుంది. ప్యాన్‌ ఇండియా మార్కెట్‌ను సొంతం చేసుకోవడానికి ఎవరి స్ట్రాటజీలు వాళ్లవి మరి...