
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్.. తెలుగులో వరుస సినిమాలతో అలరించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాని సరసన నటించి మెప్పించింది. కానీ ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా అందుకోలేకపోయింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఆ హాట్ బ్యూటీ ఎవరో కాదండోయ్.. న్యాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాతోనే కుర్రకారును కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ వచ్చాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమాతోపాటు.. అల్లు అర్జున్ సరసన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీలో నటించింది. ఈ చిత్రాలు ప్లాప్ కావడంతో ఈ అమ్మడుకు అంతగా క్రేజ్ రాలేదు.

తెలుగులో కిట్టు ఉన్నాడు జాగ్ర్తత, ఆక్సిజన్, శైలజారెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్, ఊర్వశివో రాక్షసివో సినిమాల్లో నటించినప్పటికీ కెరీర్ మొత్తంలో వరుస ప్లాప్స్ ఎదురయ్యాయి. తెలుగులోతాపుట తమిళలోనూ నటించినప్పటికీ సరైన హిట్టు రాలేదు.

వరుస సినిమాలు ప్లాప్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ తగ్గిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు అందాలు ఆరోబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. నెట్టింట మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ సరైన హిట్టు మాత్రం రాలేదు.