
ప్రస్తుత కాలంలో ఓటీటీ సినీ ప్రపంచంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. వెబ్ సిరీస్, సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే గత ఆరేళ్లుగా ఒక వెబ్ సిరీస్ దూసుకుపోతుంది. జనాలకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించే ఈ సిరీస్ భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్. నాలుగు సీజన్స్, 32 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఇంతకీ ఈ సిరీస్ పేరెంటో తెలుసుకుందామా.

ఎలాంటి సస్పెన్స్ లేదు.. అలాగే హింస కూడా లేదు. స్టార్ హీరోహీరోయిన్స్, గ్లామర్ పాటలు లేవు. అయినప్పటికీ ఈ సిరీస్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఈ సిరీస్‌కు సంబంధించిన మొత్తం నాలుగు సీజన్‌లు విడదలయ్యాయి. అందులో మొత్తం 32 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్ని సీజన్స్ సూపర్ హిట్ అయ్యాయి. మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు పంచాయత్. మొన్నటివరకు ఈ సిరీస్ పేరు సోషల్ మీడియాలో మారుమోగింది. అలాగే ఇందులో అందరూ చిన్న చిన్న నటీనటులే నటించడం విశేషం.

ఈ కామెడీ వెబ్ సిరీస్‌లో పెద్ద స్టార్లు ఎవరూ లేనప్పటికీ, ఇది భారతదేశంలో నంబర్ వన్ వెబ్ సిరీస్‌గా మారింది పంచాయత్. ఇందులో జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా వంటి నటీనటులు ఉన్నారు. మీరు ఈ సిరీస్‌ను ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఈ సిరీస్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది. 'పంచాయత్' మొదటి సీజన్ 2020లో విడుదలైంది. రెండు సంవత్సరాల తర్వాత, 2022లో రెండవ సీజన్, మూడవ సీజన్ 2024లో, నాల్గవ సీజన్ 2025లో విడుదలయ్యాయి.

ప్రతి సీజన్‌లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉన్నాయి. 'పంచాయత్' ఐదవ సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీజన్ ఈ ఏడాది ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ఈ ఐదవ సీజన్ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ సీజన్‌లో కూడా ఫులేరా గ్రామానికి సంబంధించిన ఉత్కంఠభరితమైన కథను చూడబోతున్నారు. కామెడీ డ్రామా వెబ్ సిరీస్ అయిన్పపటికీ గ్రామీణ జీవితానికి, అక్కడి ప్రజల అమాయకత్వానికి దగ్గర ఉండడంతో సూపర్ హిట్ అయ్యింది.

మొదటి సీజన్ లో.. గ్రామంలో అభిషేక్ అడుగుపెట్టడం, అక్కడి వాతావరణానికి అలవాటు పడటం.. రెండవ సీజన్ గ్రామ సమస్యలు, స్నేహం , కొన్ని భావోద్వేగాల కలయిక.. మూడవ సీజన్ ఫులేరా గ్రామ రాజకీయాలు, ప్రధాన్ , భూషణ్ గ్యాంగ్‌ల మధ్య పోటీ.. ఇక నాల్గవ సీజన్ కథ మరింత ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. త్వరలోనే ఈ సిరీస్ ఐదవ సీజన్ సైతం స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ హిందీలోనే కాకుండా తెలుగులోనూ అందుబాటులో ఉంది.