
సినిమా ఇండస్ట్రీలో ఒక నటి గుర్తింపు తెచ్చుకోవడానికి ఏళ్ల తరబడి కష్టపడాలి. కానీ, మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ పరిస్థితి అందుకు భిన్నం. కేవలం ఒక చిన్న కన్నుగీటుతో దేశవ్యాప్తంగా యువత గుండెల్లో అలజడి సృష్టించి, రాత్రికి రాత్రే 'నేషనల్ క్రష్'గా పేరుగాంచింది. 'ఒరు ఆధార్ లవ్' చిత్రంలోని "మాణిక్య మలరాయ పూవి" పాటలో ఆమె పలికించిన హావభావాలు సోషల్ మీడియాలో సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు.

ఒక్క వీడియో క్లిప్‌తో వచ్చిన క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగినా, సినిమాల విషయంలో మాత్రం ఆమెకు సవాళ్లు ఎదురయ్యాయి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. తెలుగులో నితిన్ సరసన 'చెక్' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానం కోసం ప్రయత్నించింది. అయితే, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఆమెకు ఆశించిన బ్రేక్ దక్కలేదు. అనంతరం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' చిత్రంలో కీలక పాత్రలో కనిపించినా, కథానాయికగా తనదైన ముద్ర వేయడానికి ఇంకా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉంది.

సినిమాల్లో విజయాల శాతం తక్కువగా ఉన్నప్పటికీ, గ్లామర్ , ఫ్యాషన్ ప్రపంచంలో ప్రియాకు తిరుగులేదు. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న భారీ ఫాలోయింగ్‌ను ఏ ఇతర నటి అందుకోవడం కష్టమే. తరచూ తన గ్లామరస్ ఫోటోషూట్‌లు, ట్రెండీ వీడియోలతో అభిమానులను ఎప్పుడూ టచ్‌లో ఉంచుకుంటుంది. అందం, స్టైల్ , ఫ్యాషన్ సెన్స్‌తో యువతను నిరంతరం ఆకట్టుకోవడంలో ఆమె సక్సెస్ అవుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ దక్షిణాది సినీ పరిశ్రమలో తన ఉనికిని చాటుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇటీవల అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంతో పాటు ధనుష్ దర్శకత్వంలో వచ్చిన 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోపమ్' వంటి సినిమాల్లో నటిస్తూ తన కెరీర్‌ను గాడిలో పెట్టుకుంటోంది. తెలుగు, తమిళం, మలయాళంలో సరైన ఛాన్స్ కోసం చూస్తుంది.

టాలీవుడ్‌లో ఇప్పటివరకు పెద్ద విజయం ఆమెను వరించకపోయినా, ఆమెకున్న ఫాలోయింగ్ , నటనపై ఆమెకు ఉన్న ఆసక్తిని చూస్తుంటే.. సరైన కథ, పవర్ ఫుల్ పాత్ర లభిస్తే మళ్లీ ప్రియా తన సత్తా చాటడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 'వింక్ సెన్సేషన్' భవిష్యత్తులో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!