
మలయాళి ముద్దుగుమ్మ కీర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చిన్నది తన అంద చందాలతోనే ప్రతి ఒక్కరినీ కట్టి పడేస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిదే. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతూ, తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

నేను శైలజ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరసగా ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా మహానటి సినిమాలో నటించి ఓవర్ టైమ్ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.

ఇక ఈ మూవీ తర్వాత వరసగా అవకాశాలు అందుకొని, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. అంతే కాకుండా తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి, మెప్పించింది. ఇక ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీని తర్వాత ఈ అమ్మడు గ్లామర్ మరింత పెంచింది.

తెలుగులో అవకాశాలు తగ్గినా, బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడ వరసగా సినిమాలు చేస్తూ, మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. వరుణ్ ధావన్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఉప్పు కప్పురంబు మూవీ తో అమెజాన్ ప్రైమ్‌లో టాప్ రేంజ్‌లో కొనసాగుతుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది. తాజాగా రెడ్ కలర్ చీరలో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోస్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.