Rajeev Rayala |
Nov 20, 2023 | 8:33 PM
చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ కావ్య కళ్యాణ్ రామ్. ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ గా మారింది.
మసూద సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కావ్య కల్యాణ్ రామ్. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.
ఆతర్వాత కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కావ్య కళ్యాణ్ రామ్.
బలగం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కావ్య కళ్యాణ్ రామ్ కు మంచి గుర్తింపు తో పాటు క్రేజీ ఆఫర్స్ కూడా క్యూ కట్టాయని తెలుస్తోంది.
ఇక ఈ బబ్లీ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ వయ్యారి చీరకట్టులో ఫోటోలకు ఫోజులిచ్చింది.