అప్పుడు వాళ్ల కాళ్లు పట్టుకున్నానని ఏడ్చేశా.. నాకు అండగా నిలిచింది ఆమే..

Updated on: Nov 12, 2026 | 9:53 PM

బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు వర్ష. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి.. తన నటనతో, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. బుల్లితెరపై నవ్వులు పంచే వర్ష వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను, బాధాకరమైన సంఘటనలను ఎదుర్కొన్నారట.

1 / 5
బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు వర్ష. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి.. తన నటనతో, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. బుల్లితెరపై నవ్వులు పంచే వర్ష వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను, బాధాకరమైన సంఘటనలను ఎదుర్కొన్నారట. ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం, తండ్రి జ్ఞాపకాలు, తల్లి ఆరోగ్యం, అన్నయ్యకు జరిగిన ప్రమాదం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వర్ష జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.

2 / 5
తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎక్స్‌ట్రా జబర్దస్త్, పోవే పోరా వంటి కార్యక్రమాల్లోనూ సందడి చేశారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఇంటర్వ్యూలు, వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో వర్ష తన తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రతి కుమార్తె జీవితంలో తండ్రే మొదటి హీరో అని ఆమె పేర్కొన్నారు. తన జీవితంలో కూడా తండ్రికి ప్రత్యేకమైన స్థానం ఉందని, ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. తన తండ్రితో కలిసి అన్నవరం, తలుపులమ్మ లోవ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లిన రోజులను వర్ష గుర్తుచేసుకున్నారు. ఆ ప్రయాణాల్లో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని, ఇప్పుడు ఆ క్షణాలన్నీ గుర్తొస్తున్నాయని తెలిపారు. తిరిగి రాని ఆ రోజులను చాలా మిస్ అవుతున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

3 / 5
తండ్రి మరణం తర్వాత తమ కుటుంబంలో ఎన్నో మార్పులు వచ్చాయని వర్ష వెల్లడించారు. ముఖ్యంగా తన తల్లి ఒంటరిగా మారిపోయారని చెప్పారు. గతంలో ప్రతి చిన్న విషయానికి తండ్రిపై ఆధారపడే తల్లి.. ఇప్పుడు ఆయన లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తండ్రి మరణం తర్వాత తల్లి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వర్ష ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి తమ కుటుంబాన్ని ఆందోళనకు గురిచేస్తోందని, తల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి తామెంతో కష్టపడుతున్నామని తెలిపారు. తల్లికి ఏమీ కాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. వర్ష జీవితంలో మరో అత్యంత బాధాకరమైన సంఘటన తన చిన్నన్నయ్యకు జరిగిన ప్రమాదం. సంక్రాంతి ఈవెంట్ సమయంలో అన్నయ్య ప్రమాదానికి గురయ్యారని ఆమె తెలిపారు.

4 / 5
ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో మెదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. అన్నయ్యకు ప్రమాదం జరిగిందని తెలియగానే హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్లిన వర్ష.. వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అన్నయ్య బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారట. ఎంత ఖర్చయినా పర్వాలేదు.. ఎక్కడికైనా తీసుకెళ్లి నా అన్నయ్యను బతికించండి అంటూ డాక్టర్ల కాళ్లు పట్టుకుని వేడుకున్నానని వర్ష వెల్లడించారు. అన్నయ్య ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆ మూడు రోజులు తన జీవితంలో మర్చిపోలేని క్షణాలని వర్ష తెలిపారు. ఆసుపత్రి బయట కాలువ పక్కన కూర్చుని అన్నయ్య కోలుకోవాలని ఎదురుచూశానని చెప్పారు. నిద్ర లేకుండా, క్షణక్షణం భయంతో గడిపానని గుర్తుచేసుకున్నారు. అప్పటికే తండ్రి మరణం, తల్లి ఆరోగ్య సమస్యలతో కుటుంబం ఇబ్బందుల్లో ఉండటంతో ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒంటరిగానే బాధ్యత తీసుకున్నానని తెలిపారు. ఆ కష్ట సమయంలో నటి రోజా తనకు అండగా నిలిచారని వర్ష చెప్పారు.

5 / 5
భయపడుతున్న తనకు రోజా ధైర్యం చెబుతూ.. 'ఏమీ టెన్షన్ పడకు వర్షా.. మేము ఉన్నాం' అని భరోసా ఇచ్చారట. మూడు రోజుల తర్వాత అన్నయ్యకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నానని, ఆ సమయంలో వైద్యుల పట్ల కృతజ్ఞతతో వారి కాళ్లు పట్టుకున్నానని వర్ష గుర్తుచేసుకున్నారు. అన్నయ్యను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చిన కొన్ని గంటలకే వర్షకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందట. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురయ్యారు. ఎక్స్‌ట్రా జబర్దస్త్, పోవే పోరా వంటి షోలలో తనతో కలిసి పనిచేసే సహచరులు కూడా ఈ విషయం తెలిసి ఆందోళన చెందారని చెప్పారు. కరోనా మహమ్మారి తనకు జీవిత విలువను తెలియజేసిందని, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని అన్నారు. అందుకే ఉన్నంతకాలం ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించాలని వర్ష చెప్పుకొచ్చారు.

Loading...
Unable to load recommendations.
Follow Us