
సినిమా పరిశ్రమలో వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే భారీ చిత్రాలు డిజాస్టర్లుగా మారుతున్న రోజుల్లో.. పరిమిత బడ్జెట్‌తో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అద్భుతం 'హనుమాన్ అంశ'. ఏమాత్రం హంగులు, ఆర్భాటాలు లేకుండా విడుదలైన ఈ భక్తిరస చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను తిరగరాసింది. కేవలం స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ఏకంగా 15,000 శాతానికి పైగా లాభాలను ఆర్జించి భారతీయ చిత్రసీమలోనే అత్యంత లాభదాయకమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

ప్రముఖ సిరియా బాబా , నేమ్ కరోలీ బాబా మహత్యం, ఆధ్యాత్మిక అంశాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను అమితంగా ఆకట్టుకుంది. థియేటర్లకు వచ్చిన జనం ప్రవాహంలా తరలిరావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1.5 కోట్లకు పైగా మంది ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో వీక్షించారు. చిన్న చిత్రంగా విడుదలైనప్పటికీ, పబ్లిసిటీ కంటే కూడా "వర్డ్ ఆఫ్ మౌత్" (ప్రేక్షకుల ప్రశంసలు)తోనే ఈ చిత్రం అసాధారణమైన కలెక్షన్లను సాధించింది.

బాక్సాఫీస్ విశ్లేషకుల ప్రకారం, ఈ చిత్రం పెట్టిన పెట్టుబడికి ఏకంగా వందల రెట్ల రాబడిని రాబట్టింది. హిందీ బెల్ట్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో థియేటర్ల నిర్వాహకులు ఈ సినిమా విజయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. భక్తి, ఆధ్యాత్మికత , నిజమైన విశ్వాసంతో రూపొందించిన కథలకు నేటికీ ప్రేక్షకాదరణ తగ్గలేదని ఈ చిత్రం నిరూపించింది.

రోలీ బాబా మహిమలు, ఆయన భక్తుల అనుభవాలు , 'హనుమాన్ అంశ'కు ఉన్న అనుబంధాన్ని దర్శకుడు తెరపై ఎంతో ప్రతిభావంతంగా చూపించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురికావడమే కాకుండా, థియేటర్లలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఓవైపు రూ. 200-300 కోట్ల బడ్జెట్ సినిమాలే కలెక్షన్ల కోసం తిప్పలు పడుతుంటే.. అతి తక్కువ ఖర్చుతో రూపొంది, 15,000 శాతం లాభాలను అందించిన ఈ చిత్రం సినీ చరిత్రలో ఒక అరుదైన రికార్డుగా నిలిచిపోనుంది.

ఈ చిత్రం విడుదలైన 54వ రోజున భారతదేశంలో 4411 షోల నుండి రూ. 3.10 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. అంతకు ముందు రోజు, అంటే సోమవారం నాడు, ఈ చిత్రం రూ. 2.25 కోట్లు సంపాదించింది. అందువల్ల, 54 రోజుల తర్వాత, భారతదేశంలో ఈ చిత్రం మొత్తం నికర వసూళ్లు రూ. 312.38 కోట్లకు చేరుకున్నాయి. కాగా, దేశంలో స్థూల వసూళ్లు రూ. 369 కోట్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 11న 'హనుమాన్ అంశ్' విదేశాలలో కూడా విడుదలైంది. విదేశాలలో సుమారు రూ. 39 కోట్ల స్థూల వసూళ్లతో, ఈ చిత్రం మొత్తం ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ. 408 కోట్లకు చేరుకున్నాయి.