
తన డాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఫోక్స్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ నాగ దుర్గ. చూడచక్కని రూపంతో చక్కటి డాన్స్ తో కట్టిపడేస్తుంది ఫోక్ డాన్సర్ నాగ దుర్గ. తన డాన్స్ తో మంది అభిమానులను సొంతం చేసుకుంది నాగ దుర్గ. ఈ చిన్నదానికి సినిమా హీరోయిన్స్ కు మంచి క్రేజ్ ఉంది.

ఈ అమ్మడి సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ ఫ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. ఫోక్ సాంగ్స్ తో పాటు పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటుంది ఈ చిన్నది. నాగ దుర్గ సాంగ్స్ కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. రీసెంట్ గాను లగారే సౌండ్ సాలా అనే సాంగ్ తో అభిమానులను ఆకట్టుకుంది.

ఒకటి కాదు రెండు కాదు.. వందల పాటలలో ప్రధాన పాత్రలో కనిపిస్తూ తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నాగ దుర్గ . పల్లె పాటలకు ఎనర్జిటిక్ డ్యాన్సులతో అదరగొడుతుంది. కేవలం డాన్సర్‌గానే కాకుండా, తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, విభిన్నమైన కాస్ట్యూమ్స్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారారు. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది నాగ దుర్గ.

ఈ అందాల భామకు తెలుగులో కాదు తమిళ్ లోనూ ఛాన్స్ అందుకుంది. ఏకంగా ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్.. జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో.. తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈయన హీరో గా రెండో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఈ సినిమాలో నాగ దుర్గ హీరోయిన్ గా నటిస్తుంది.

పవీష్ రెండో సినిమాకు కొత్త డైరెక్టర్ మగేష్ రాజేంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. ఆయన గతంలో తమిళంలో వచ్చిన బోగన్ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్‌లో పనిచేశాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ సినిమాకు లవ్ ఓ లవ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా తర్వాత నాగ దుర్గ తెలుగులోనూ మంచి అవకాశాలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.