
నటి దివ్య భారతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి బొబ్బిలి రాజా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదా సంపాదించుకుంది. కానీ అనుకోకుండా ఈ నటి 1993లో కన్ను మూసింది. 19 ఏళ్లకే ఈ బ్యూటీ మరణించడంతో ఈ అభిమానులు , చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

తెలుగు నటి ప్రత్యూష గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు రాయుడు చిత్రం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యింది. ఈ ముద్దుగుమ్మ అతి చిన్న వయసులో 20 ఏళ్ల వయసులోనే మరణించడం జరిగింది. 2002 ఫ్రిబ్రవరి 2న ప్రత్యూష మరణించింది.

నువ్వు నాకు నచ్చావు సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ఆర్తి అగర్వాల్. మొదటి సినిమాతోనే ఈ నటి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత చాలా సినిమాల్లో నటించింది. తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ నటి జూన్ 6, 2015లో ఆపరేషన్ వికటించి మరణించింది. 31 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయింది.

ఆ తరం వారికే కాదు, ఈ తరం వారికి కూడా ఇష్టమైన నటి సౌందర్య. ఈ నటి అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకొని, టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తన హవా కొనసాగించింది. ఈ నటి 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.

తన డ్యాన్స్‌తో ఎంతో మందని ఆకట్టుకొని స్పెషల్ సాంగ్స్‌లో మెరిసిన ముద్దుగుమ్మ సిల్క్ స్మిత. ఈ నటి చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని మరణించింది. సెప్టెంబర్ 23, 1996లో కన్నుమూసింది.