
తెలుగులో 'ఆనంద్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, తన సహజమైన అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటి కమలినీ ముఖర్జీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె, తమిళంలో కమల్ హాసన్ సరసన 'వేటైయాడు విళైయాడు' (రాఘవన్) చిత్రంలో నటించి దక్షిణాది ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

సినిమాలకు కొంతకాలం పాటు దూరంగా ఉన్న కమలినీ ముఖర్జీ, తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేశారు. ఆమె లుక్‌లో వచ్చిన ఈ ఊహించని మార్పు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో ఉన్న రూపానికి పూర్తిగా భిన్నంగా, సరికొత్త స్టైలిష్ అండ్ ఫిట్ మేకోవర్‌తో ఆమె కనిపిస్తుండటాన్ని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కమలినీ, పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి విదేశాలలో స్థిరపడ్డారు.

అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను, కొత్త ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఈ కొత్త చిత్రాలు ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సంవత్సరాలు గడిచినా ఆమెలో ఉన్న అందం ఏమాత్రం తగ్గలేదని, పైగా మరింత గ్రేస్‌ఫుల్‌గా మారారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కమలినీ ముఖర్జీ లేటెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.

బాలీవుడ్‌లో 'ఫిర్ మిలేంగే' చిత్రంతో నటిగా ప్రయాణం ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమకథా చిత్రం 'ఆనంద్' ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలోని ఆమె అభినయం తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమా విజయంతో ఆమె ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆ తర్వాత 'గోదావరి' వంటి క్లాసిక్ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ మరియు హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి పాన్-ఇండియా స్థాయిలో పేరు సంపాదించారు. తెలుగులో నాగార్జున, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల సరసన 'జల్సా', 'హ్యాపీ డేస్', 'గోవిందుడు అందరివాడేలే' వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే గత పదేళ్లుగా ఆమె పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చివరిసారిగా రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో నటించిన ఆమె, ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు.