
మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి పలు యాడ్స్ ద్వారా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా డెట్టాల్ యాడ్ ద్వారా ఫేమస్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు అందుకుంది. ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె మరెవరోకాదు.. హీరోయిన్ మాళవిక శర్మ.

మాళవిక శర్మ..తెలుగులో పాపులర్ హీరోయిన్. మాస్ మహారాజా రవితేజ నటించిన నేలటికెట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. కానీ అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ బ్యూటీ మంచి మార్కులు కొట్టేసింది.

రామ్ పోతినేని సరసన రెడ్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ సైతం నిరాశే పరిచింది. ఆ తర్వాత భీమా, హరోం హర వంటి చిత్రాల్లో కనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో కలిసిరాలేదు. మొత్తానికి ఆమె చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందాలతో గత్తరలేపుతుంది. గ్లామరస్ ఫోటోషూట్లతో నెట్టింట అరాచకం సృష్టిస్తుంది ఈ అమ్మడు. గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది.

మాళవిక శర్మ.. 2017లో హిమాలయా, డెట్టాల్, మలబార్ వంటి ప్రకటనలలో కనిపించి పాపులర్ అయ్యింది. కేవలం నటిగానే కాకుండా న్యాయవాద వృత్తిని సైతం కొనసాగిస్తుంది. రిజ్వీ లా కాలేజీ నుండి క్రిమినాలజీలో స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీతో పట్టభద్రురాలైంది.