
సినిమా ఇండస్ట్రీలో దళపతి విజయ్ ఓ సపరేట్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. హీరోగా తమిళ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు విజయ్. తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు విజయ్. ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు దళపతి విజయ్. తొలి ఎన్నికల్లోన్నే విజయ్ సంచలన విజయం సాధించాడు. ఏకంగా విజయ్ 108 సీట్స్ సొంతం చేసుకున్నారు.

దళపతి విజయ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో అభిమానులు అందంలో తేలిపోతున్నారు. ఎక్కడ చూసిన విజయ్ విజయంపై అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే విజయ్ కు సోషల్ మీడియాలో అభిమానులు, సినీ సెలబ్రెటీలు విషెస్ తెలుపుతున్నారు. విజయ్ విజయం పై సెలబ్రెటీలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో దళపతి విషెష్ వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఓ ముద్దుగుమ్మ విజయ్ తో ఉన్న ఓల్డ్ ఫోటో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ క్రేజీ హీరోయిన్.. తెలుగులో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్ లతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఆమె ఎవరో తెలుసా.? విజయ్ తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

ఆమె మరెవరో కాదు అందాల భామ షీలా. తెలుగు సినిమాతోనే. 2006లో నవదీప్ తో కలిసి సీతాకోక చిలుక అనే సినిమాతో టాలీవుడ్ ను పలకరించింది షీలా.. ఆ తరవాత మంచు మనోజ్ తో రాజుభాయ్, సాయిరాం శంకర తో కలిసి హలో ప్రేమిస్తార సినిమాల్లో యాక్ట్ చేసింది. అయితే షీలాకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం అల్లు అర్జున్ పరుగు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

రామ్ తో మస్కా, ఎన్టీఆర్ అదుర్స్, బాలకృష్ణతో పరవ మీర చక్ర సినిమాల్లో నటించింది. అయితే ఈ సినిమాల్లో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ కే పరిమితమైంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించింది షీలా.2108లో హైపర్ అనే కన్నడ సినిమాలో చివరిసారిగా నటించింద షీలా. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. 2020లో సంతోశ్ రెడ్డిని వివాహం చేసుకుందీ అందాల తార.