ఈ వాలు జడ చిన్నారిని గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ ఆ అమ్మడు

Updated on: Nov 20, 2026 | 10:03 AM

సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే అందం, అభినయం మాత్రమే కాదు.. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల అంగీకారం లేకపోయినా తమ కలను నిజం చేసుకోవడానికి కొందరు ఎన్నో కష్టాలు పడుతుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల ఒకరు. ప్రస్తుతం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ బ్యూటీ ప్రయాణం వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

1 / 5
సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే అందం, అభినయం మాత్రమే కాదు.. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల అంగీకారం లేకపోయినా తమ కలను నిజం చేసుకోవడానికి కొందరు ఎన్నో కష్టాలు పడుతుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల ఒకరు. ప్రస్తుతం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ బ్యూటీ ప్రయాణం వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడం కోసం చేసిన ప్రయత్నాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కామాక్షి భాస్కర్ల ఆంధ్రప్రదేశ్‌లో జన్మించి పెరిగారు.

2 / 5
చిన్నప్పటి నుంచే చదువులో ముందుండే ఆమె చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో కూడా పనిచేశారు. అయితే వైద్య వృత్తితో పాటు మోడలింగ్, నటనపై కూడా ఆమెకు ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే అందాల పోటీల వైపు అడుగులు వేశారు.2018లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ పోటీల్లో పాల్గొన్న కామాక్షి విజేతగా నిలిచారు. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకున్నారు. అయితే ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. అందాల పోటీల్లో పాల్గొనాలనే ఆమె నిర్ణయానికి మొదట్లో కుటుంబం నుంచి పెద్దగా మద్దతు లభించలేదు.

3 / 5
 ఓ ఇంటర్వ్యూలో తన గతాన్ని గుర్తుచేసుకున్న కామాక్షి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చైనాలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే పోటీల్లో పాల్గొనడానికి అవసరమైన ఖర్చుల విషయంలో ఇంట్లో అంగీకారం లభించలేదని చెప్పారు. ముఖ్యంగా తన తండ్రి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారని, అందుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని స్పష్టంగా చెప్పారని గుర్తుచేసుకున్నారు. అయినప్పటికీ తన కలను వదులుకోవడానికి కామాక్షి సిద్ధపడలేదు. మిస్ ఇండియా పోటీల కోసం అవసరమైన డబ్బును తానే సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నారు.

4 / 5
ఈ క్రమంలోనే మెడిసిన్ చదువుతూనే చైనాలోని ఓ రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ డ్యాన్సర్‌గా పనిచేసినట్లు కామాక్షి వెల్లడించారు. అక్కడి ప్రజలకు ఇండియన్ డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని, అందుకే రెస్టారెంట్‌లో డ్యాన్స్ చేసేదాన్నని తెలిపారు. ఒకవైపు మెడిసిన్ చదువు.. మరోవైపు పార్ట్‌టైమ్ ఉద్యోగం.. ఇలా రెండింటినీ సమన్వయం చేసుకోవడం ఎంతో కష్టంగా ఉండేదని చెప్పారు. చదువుతో పాటు ఉద్యోగం చేయడం వల్ల బాగా అలసిపోయేదాన్నని తన అనుభవాలను పంచుకున్నారు.

5 / 5
మిస్ ఇండియా పోటీల తర్వాత కామాక్షి నటన వైపు అడుగులు వేశారు. తొలినాళ్లలో సహాయక పాత్రలు చేసిన ఆమె.. ఆ తర్వాత కథానాయికగా కూడా అవకాశాలు అందుకున్నారు. ముఖ్యంగా 'మా ఊరి పొలిమేర', 'మా ఊరి పొలిమేర 2' సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వైవిధ్యమైన పాత్రలతో తన నటనను నిరూపించుకుంటూ టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు డాక్టర్‌గా పనిచేసిన కామాక్షి.. తన కలను నెరవేర్చుకోవడానికి పార్ట్‌టైమ్ డ్యాన్సర్‌గా కూడా పనిచేశారు. ఇప్పుడు నటిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు.  

Loading...
Unable to load recommendations.
Follow Us