
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అలాగే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదలయ్యాయి. ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తుంది. జూన్ లో సినిమాను విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ సరసన ఇంటర్ చదివిన హీరోయిన్ నటించింది. పైగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు బాలీవుడ్ అందాల భామ అలియా భట్. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ చిన్నది చదివింది మాత్రం ఇంటరే., సిని ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన అలియా భట్.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

ఈ క్రమంలోనే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మరోసారి తెలుగులో సినిమా చేస్తుందని తెలుస్తుంది. ఇక ఈ అమ్మడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే..