
చూడచక్కని రూపంతో కవ్వించే ముందుగుమ్మలు సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అందం అభినయం ఉన్నా.. అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే అందుకుంటున్న భామలు 9ఇండస్ట్రీలో కోకొల్లలు, కొంతమంది వరుస సినిమాలతో దూసుకుపోతుంటే మరికొంతమంది మాత్రం అవకాశాలు లేక రేస్ లో వెనబడుతున్నారు. ఆ లిస్ట్ లో పైన కనిపిస్తున్న బ్యూటీ ఒకరు.

కలువ లాంటి కళ్లు ఉన్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. ?హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఈ ముద్దుగుమ్మ. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఈ చిన్నది అందాల ఆరబోతలోనూ ఏమాత్రం మొహమాట పడదు. తన సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో గ్లామర్ తో కుర్రాళ్లను కవ్విస్తుంది. ఇంతకు ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు.

చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆమె.. తన కళ్ల తోనే పాపులర్ అయ్యింది. కన్నుకొట్టి కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టింది. ఆమె మరెవరో కాదు ప్రియా ప్రకాష్ వారియర్. ఓరు ఆధార్ లవ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో కన్ను కొట్టే సీన్ తో క్రేజ్ సొంతం చేసుకుంది.

అందం అభినయం ఉన్నా కూడా ప్రియాకు ఆఫర్స్ రావడం లేదు. తెలుగులో నితిన్ తో కలిసి చెక్ అనే సినిమా చేసింది. ఈ సినిమా వచ్చి పోయింది కూడా ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన బ్రో సినిమాలో కనిపించింది. ఈ మూవీ కూడా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ప్రియా ప్రకాష్ ఓ రేంజ్ లో యాక్టివ్ గా ఉంటుంది.

తెలుగులో ఈ అమ్మడు మూడే మూడు సినిమాలు చేసింది. కానీ ఆ మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఓవర్ నైట్ లో స్టార్ అయినప్పటికీ హిట్స్ మాత్రం కొట్టలేకపోతుంది. నెట్టింట ఈ చిన్నదాని ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటుంది ప్రియా. తాజాగా ఇలా నీళ్లలో దిగి పరువాలతో వలలు వేసింది. ఈ అమ్మడి లేటెస్ట్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.