
చిత్రపరిశ్రమలో ఎంతో మంది అందాల భామలు క్రేజ్ తెచ్చుకోలేక సినిమాలకు దూరంగా ఉంటున్న భామలు కూడా ఉన్నారు. కొందరు క్రేజ్ తెచ్చుకున్నా అవకాశాలు అందుకోలేకపోతున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసి ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ముందు వరసలో ఉంటుంది.

ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ సినిమాలు మానేసి పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. అయితే అభిమానులు ఈ ముద్దుగుమ్మల కోసం సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు.? ఎక్కడ ఉన్నారు.? ఏం చేస్తున్నారు.? అంటూ ఆరాలు తీస్తున్నారు. ఇప్పుడు ఓ చిన్నదాని కోసం నెటిజన్స్ గూగుల్ లో తెగ గాలిస్తున్నారు. ఇంతకూ ఆ భామ ఎవరో తెలుసా.?

తెలుగులో ఈ బ్యూటీ చేసింది ఎనిమిది సినిమాలు కానీ హిట్ అయ్యింది మాత్రం ఒకే ఒక్క సినిమా. అందంలో ఈ వయ్యారి అప్సరస.. కెరీర్ పీక్ లో ఉండగానే సినిమాలకు దూరం అయ్యింది. మరెవరో కాదు పాలరాతి శిల్పంలా ఉండే ప్రణీత సుభాష్. అందం, అభినయం ఉన్నా కూడా సక్సెస్ సాధించలేకపోయింది ఈ బ్యూటీ.

హీరోయిన్ గా చేసింది, సెకండ్ హీరోయిన్ గాను చేసింది అయినా కూడా ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు.తన క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రణీత సుభాష్ కు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అమ్మడు.

హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. కానీ ఈ అమ్మడికి ఆఫర్స్ రాలేదు. దాంతో మెల్లగా ఈ చిన్నది సినిమాలకు దూరం అవుతూ వచ్చింది. మెయిన్ హీరోయిన్ గానే కాదు సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. అయినా కూడా అంతగా సక్సెస్ సాధించలేదు. కెరీర్ పీక్ లో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా అందంతో ఆకట్టుకుంటుంది ప్రణీత సుభాష్.