
చిత్రపరిశ్రమలో 1990లలో అందం, అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అద్భుతమైన నటనతో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు చాలా మంది అందాల భామలు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి ఒకరు. ఆమె అప్పట్లో కుర్రాళ్ల కలల రాకుమారి. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషలలో స్టార్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.

ఆకట్టుకునే అందం, అద్భుతమైన నటనతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది ఈ నటి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి ఎవరో కాదు పేరు సితార. ఆమె పేరు చెప్తే ఇప్పుడు జనరేషన్ ఆడియన్స్ పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆమె ఫోటో చూస్తే టక్కున గుర్తుపట్టేస్తారు. ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు రాణిస్తున్నారు సితార.

ప్రస్తుతం ఆమె వయసు 53 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు ఆమె. 1986లో మలయాళ చిత్రం కావేరితో సితార నటిగా సినీప్రయాణం మొదలు పెట్టారు. మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన ఈ చిత్రం ఆమెకు గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది. దర్శకుడు కె. బాలచందర్ చిత్రం పుదుపుతు అర్థంగల్ తో సితార తమిళంలో అడుగుపెట్టింది.

ఆ చిత్రంలో కనిపించిన కేలడి కన్మణి అనే ఒకే ఒక్క పాట ఆమెను మరింత పాపులర్ చేసింది. తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటించారు. సితారకు ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. కానీ ఆకస్మాత్తుగా తండ్రి చనిపోవడంతో ఆమె జీవితం తలకిందులైంది. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యత మొత్తం సితార భుజాలపై వేసుకుంది.

తండ్రి కోరిక తీర్చడానికి, ఆమె తన తమ్ముడిని చదివించి డాక్టర్‌ను చేసింది. ఈ కుటుంబ బాధ్యతల మధ్య ఆమె పెళ్లికి దూరంగా ఉండిపోయింది. ఎప్పుడు పెళ్లి గురించి ఆలోచించలేదు ఆమె. ఒకప్పుడు హీరోయిన్ గా బిజీగా ఉన్న సితారకు ఆ తర్వాత అవకాశాలు సైతం తగ్గిపోయాయి. దీంతో ఆమె సహాయ నటిగా మారింది. సినిమాలతోపాటు సీరియల్స్ సైతం చేసింది. ఇప్పటికీ సినిమాల్లో పలు పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటుంది.