Cinema : ఒంటరితనం కంటే ఎక్కువ భయపెట్టేది అదే.. వణుకు పుట్టించే సీన్స్.. మలయాళీ హారర్ థ్రిల్లర్ డ్రామాను చూశారా.. ?

Updated on: Apr 13, 2026 | 3:26 PM

హారర్ సినిమాలు చూడడం మీకు ఇష్టమా.. ? ఊహించని మలుపులు, వణుకుపుట్టించే సీన్లతో సాగే ఈ చిత్రాలను చూడడం మీకు ఇంట్రెస్టా.. ? అయితే ఈ మూవీ గురించి తెలుసుకోవాల్సిందే. ఒంటరితనం కంటే ఎక్కువగా అతీంద్రియ శక్తుల ద్వారా ఎక్కువగా భయపడుతుంటారు. దెయ్యాన్ని ఎలా ఎదుర్కొవాలో తెలియక ఆలోచనలతో యుద్ధం చేస్తుంటారు.

1 / 5
ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతున్న ఒక హారర్ థ్రిల్లర్ డ్రామా గురించి మీకు తెలుసా.. ? సినిమా ప్రారంభం నుంచి చివరగా క్లైమాక్స్ వరకు ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఈ మూవీ దాదాపు రెండు గంటల కంటే తక్కువ నిడివి ఉంది.  భయానక దృశ్యాలతో మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది ఈ చిత్రం. ఇంతకీ ఈ మూవీ పేరెంటో తెలుసా.. ?

2 / 5
'భూతకాలం' అనేది రాహుల్ సదాశివం దర్శకత్వంలో, షేన్ నిగమ్, రేవతి ప్రధాన పాత్రలలో నటించిన ఒక మలయాళ చిత్రం, ఇది 2022లో విడుదలైంది. ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇది ఒక సాధారణ ఆన్‌లైన్ కథ అయినప్పటికీ, దర్శకుడు దీనిని ఒక స్క్రీన్‌ప్లేగా మలిచారు.

3 / 5
ఒక ఇంట్లో తల్లి, కొడుకు, అమ్మమ్మ నివసిస్తుంటారు. ఆ తల్లి కొడుకులు అనారోగ్యంతో ఉన్న తమ అమ్మమ్మను జాగ్రత్తగా చూసుకుంటారు. అకస్మాత్తుగా ఒక రోజు, ఆ అమ్మమ్మ చనిపోతుంది. ఆ తర్వాత, ఆ ఇంట్లో అతీంద్రియ సంఘటనలు జరుగుతున్నాయని వారు గ్రహిస్తారు. వరుస సంఘటనలతో బెదిరింపులకు గురైన షేన్ నిగమ్, రేవతి చివరికి ఆ ఇంటి నుండి తప్పించుకున్నారా లేదా? అసలు ఏం జరిగింది? అనేది ఈ సినిమా మిగతా కథ.

4 / 5
'భూతకాలం' హారర్ సినిమా ప్రియుల కోసం రూపొందించిన చిత్రం. మధ్యలో కొన్ని చోట్ల సినిమా నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించినా, భయానక సన్నివేశాలను చిత్రీకరించిన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. సుదీర్ఘమైన ఫ్లాష్‌బ్యాక్‌లు గానీ, ఒక క్రమ పద్ధతిలో సాగే కథనం గానీ లేకుండా, రాహుల్ సదాశివం ఒక ఇంట్లో జరిగే అతీంద్రియ సంఘటనలను చాలా భయానకంగా చిత్రీకరించారు.

5 / 5
 ఈ చిత్రంలో రేవతి, షేన్ నికమ్‌ల నటన అమోఘం. కథ ఎక్కువగా వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. భయానక సన్నివేశాలలో గోపీ సుందర్ అందించిన నేపథ్య సంగీతం ఆ భయాన్ని మరింత పెంచుతుంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో గుండె వేగాన్ని ఆపుకోలేం. సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకులలో ఒకరకమైన ప్రశాంతత కలిగిస్తుంది.

Follow Us