300లకు పైగా సినిమాలు.. తొలి సినిమాకే రూ. 15 రెమ్యునరేషన్.. ఈ హీరోయిన్ రేంజే వేరు

Updated on: Oct 02, 2026 | 1:55 PM

ఇప్పటి రోజుల్లో స్టార్ హీరోయిన్లు ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. హీరోలతో సమానంగా తమ మార్కెట్‌ను పెంచుకుంటూ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులు ఇలా ఉండేవి కాదు. అప్పట్లో సినిమాల బడ్జెట్‌లు కూడా తక్కువగానే ఉండేవి.

1 / 5
ఇప్పటి రోజుల్లో స్టార్ హీరోయిన్లు ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. హీరోలతో సమానంగా తమ మార్కెట్‌ను పెంచుకుంటూ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులు ఇలా ఉండేవి కాదు. అప్పట్లో సినిమాల బడ్జెట్‌లు కూడా తక్కువగానే ఉండేవి. హీరోలు, హీరోయిన్ల పారితోషికాలు కూడా ఇప్పటితో పోలిస్తే చాలా తక్కువ. కానీ కొందరు స్టార్ హీరోయిన్లు మాత్రం తమకున్న క్రేజ్, మార్కెట్‌ను బట్టి అప్పట్లోనే భారీ పారితోషికాలు అందుకున్నారు. అలాంటి స్టార్ హీరోయిన్స్ లో శ్రీదేవి పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

2 / 5
దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి.. తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి టాప్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలను  అందుకున్నారు శ్రీదేవి. 1988లో నాగార్జున హీరోగా తెరకెక్కిన ఆఖరి పోరాటం సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరించారు. అప్పటికే నాగార్జునకు యూత్‌లో మంచి క్రేజ్ ఉండగా, శ్రీదేవి స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. దీంతో ఈ కాంబినేషన్‌పై అప్పట్లోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

3 / 5
అయితే ఈ సినిమాకు శ్రీదేవి తీసుకున్న పారితోషికం అప్పట్లో సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగించింది. ఆఖరి పోరాటం సినిమా కోసం శ్రీదేవికి నిర్మాత అశ్వినీదత్ సుమారు రూ.15 లక్షల పారితోషికం చెల్లించినట్టు తెలుస్తుంది. ఈ రోజుల్లో రూ.15 లక్షలు అంటే ఒక సినిమా పారితోషికంగా పెద్ద అమౌంట్ అనే చెప్పుకోవాలి. కానీ 1988 ఏడాదిలో ఇప్పుడు ఎన్నో కోట్లు ఉంటుంది. అప్పట్లో సినిమా బడ్జెట్‌లు కూడా ఇప్పటిలా వందల కోట్లలో ఉండేవి కాదు. అలాంటి సమయంలో ఒక హీరోయిన్‌కు రూ.15 లక్షల వరకు పారితోషికం చెల్లించడం అంటే ఆమెకున్న మార్కెట్, డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

4 / 5
శ్రీదేవి అప్పటికే కేవలం తెలుగు సినిమాలకే పరిమితమైన హీరోయిన్ కాదు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఆమెకు వచ్చిన గుర్తింపు ఆమె పారితోషికాన్ని కూడా భారీగా పెంచింది. దక్షిణాదిలోనూ ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో  హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఆసక్తి చూపించేవారు. ఆఖరి పోరాటంలో నాగార్జున, శ్రీదేవి కాంబినేషన్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన విషయాల్లో శ్రీదేవి రెమ్యునరేషన్ కూడా అప్పుడప్పుడు చర్చకు వచ్చింది.

5 / 5
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు, రూ.10 కోట్లు, అంతకంటే ఎక్కువ పారితోషికాలు అందుకుంటున్న వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ఆ సంఖ్యలతో పోల్చుకుంటే 1988లో శ్రీదేవి అందుకున్న రూ.15 లక్షలు చాలా చిన్న మొత్తంలా కనిపించవచ్చు. కానీ దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఆ మొత్తానికి ఉన్న విలువ వేరు. దాంతో అది అప్పట్లో భారీ పారితోషికమే అని చెప్పవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us