
కొన్ని సినిమాలతోనే చాలా మంది హీరోయిన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. ఈ వయ్యారి భామ కూడా అదే కోవకు చెందింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్. చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఈమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ అందుకోలేకపోతుంది.

అయితే, ఈమె కెరీర్‌లో ఒకే ఒక సినిమా ఏకంగా 30 ముద్దు సీన్ల కారణంగా అప్పట్లో సంచలనంగా మారింది.1987 మే 16న నోయిడాలో జన్మించిన సోనాల్ చౌహాన్, ఢిల్లీలోని గార్గి కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 2005లో ‘మిస్ వరల్డ్ టూరిజం’ టైటిల్‌ను గెలుచుకున్న తొలి ఇండియన్‌గా ఆమె రికార్డు సృష్టించింది. ఆ తర్వాత హిమేష్ రేష్మియా పాపులర్ మ్యూజిక్ ఆల్బమ్ ‘ఆప్కా సురూర్’లోని ‘సంఝో నా’ సాంగ్‌తో పాపులర్ అయ్యింది.

ఈ క్రేజ్‌తో 2008లో ఇమ్రాన్ హష్మీ సరసన జన్నత్ సినిమాతో బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, సోనాల్‌ను ఓవర్ నైట్ స్టార్ డమ్ తో పాటు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. అయితే ఆతర్వాత అవకాశాలు అందుకోవడం లోనే సోనాల్ వెనకబడింది. ఈ క్రమంలోనే 2013లో ఆమె నీల్ నితిన్ ముఖేష్‌తో కలిసి ‘3G – ఎ కిల్లర్ కనెక్షన్’ అనే హర్రర్ థ్రిల్లర్ చిత్రంలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

అయితే ఆ సినిమాలో ఓ రికార్డు బ్రేకింగ్ బోల్డ్ సీన్స్ వల్ల విపరీతంగా వార్తల్లో నిలిచింది. ఈ ఒక్క సినిమాలోనే ఏకంగా 30 లిప్‌లాక్ సీన్లు ఉండటం అప్పట్లో బాలీవుడ్ లోనే కాదు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ఇమ్రాన్ హష్మీ, మల్లికా షెరావత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మర్డర్’ సినిమాలో 20 కిస్ సీన్స్ ఉండగా.. ‘3G’ సినిమా ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఈ 30 ముద్దు సీన్ల వివాదంపై అప్పట్లో సోనాల్ చౌహాన్ స్పందించింది కూడా..

దీని పై ఆమె మాట్లాడుతూ.. కేవలం ప్రమోషన్ల కోసం లేదా పబ్లిసిటీ కోసం తాను బోల్డ్ సీన్స్ చేయనని, కథ డిమాండ్ చేయడం వల్లే ఆ సీన్లలో నటించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆమె గ్లామర్ హాట్ టాపిక్‌గా మారింది.ఇక తెలుగులో రెయిన్‌బో, లెజెండ్,డిక్టేటర్, రూలర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే నాగార్జున ది ఘోస్ట్, రవితేజ బలుపు, ప్రభాస్ ఆదిపురుష్‌లో సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.