స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఈరోజు సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణులలో ఒకరిగా దూసుకుపోతున్నారు. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె వెనుక ఎంతో కష్టం, నిరంతర శ్రమ ఉన్నాయి. ఇటీవల ప్రముఖ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేసిన ఒక టాక్ షోలో సమంత పాల్గొని, తన కెరీర్ ప్రారంభానికి ముందు చేసిన మొదటి ఉద్యోగం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఈ షోలో ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి సమంత గురించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. సమంత చిన్నప్పటి నుండి చదువులో టాపర్ అని, ఆమెకు ఆస్ట్రేలియా వెళ్లి ఉన్నత చదువులు చదవాలని ఎంతో కోరికగా ఉండేదని తెలిపారు. దీనిపై సమంత స్పందిస్తూ.. అవును, అది నిజమేనని ఒప్పుకున్నారు. ఒకవేళ తన తల్లిదండ్రులు ఆర్థికంగా స్థోమత ఉండి, తనను చదువు కోసం విదేశాలకు పంపించి ఉంటే, ఈరోజు తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేదాన్ని కాదని, అసలు హీరోయిన్ అయ్యేదాన్ని కూడా కాదేమోనని అన్నారు.

జీవితంలో ఎలాగైనా కష్టపడి ఏదో ఒకటి సాధించాలనే కసి, పట్టుదల అప్పటి నుంచే తనలో బలంగా నాటుకుపోయాయని ఆమె చెప్పుకొచ్చారు. త్వరలో విడుదల కాబోతున్న తన సరికొత్త చిత్రం 'మా ఇంటి బంగారం' గురించి కూడా సమంత మాట్లాడారు. ఈ సినిమా ట్రైలర్‌లో కనిపించిన యాక్షన్ సీన్స్‌పై ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రేక్షకులు తనను సాఫ్ట్ లేదా గ్లామరస్ పాత్రల్లో చూడటానికి ఇష్టపడతారని, కానీ తనకు వ్యక్తిగతంగా స్టంట్స్ ,యాక్షన్ సీక్వెన్స్ చేయడం చాలా ఇష్టమని పేర్కొన్నారు.

ఇలాంటి యాక్షన్ సీన్స్ తెరపై సహజంగా పండాలంటే శారీరక దృఢత్వం చాలా అవసరమని, అందుకే తాను ఫిట్‌నెస్ , వర్కవుట్స్ విషయంలో ఎప్పుడూ రాజీ పడనని స్పష్టం చేశారు. సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత దాదాపు లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో పూర్తి స్థాయి లేడీ ఓరియెంటెడ్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.