
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ, అఖండ 2 సినిమాలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాలయ్యను పవర్‌ఫుల్ పాత్రల్లో చూపిస్తూ బోయపాటి తెరకెక్కించిన తీరు ఈ కాంబినేషన్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే చాలు అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. అయితే బాలయ్య-బోయపాటి కాంబినేషన్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే సినిమాల్లో లెజెండ్ ఒకటి.

2014లో విడుదలైన ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించగా, జగపతిబాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా సినిమాకు మంచి హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా సినిమాలో బాలకృష్ణ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమన్, సుహాసిని, బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, అజయ్, బ్రహ్మాజీ, రావు రమేష్, చలపతిరావు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

అయితే ఇంతమంది ప్రముఖ నటీనటుల మధ్యలో చాలా చిన్న పాత్రలో కనిపించిన ఓ చిన్నారి మాత్రం ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. బాలయ్యను ఆ చిన్నారి ముద్దుగా “మావయ్యా” అంటూ పిలిచే సన్నివేశం అప్పట్లో ప్రేక్షకులకు బాగా నచ్చింది. సినిమా విడుదలై ఎన్నో సంవత్సరాలు గడిచినా ఆ సన్నివేశాన్ని అభిమానులు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. లెజెండ్ సినిమాలో బాలయ్యను “మావయ్యా” అంటూ పిలిచిన ఆ చిన్నారి పేరు జోషిత శ్రీను. ఆమె దర్శకుడు బోయపాటి శ్రీను కుమార్తె. లెజెండ్ సినిమా సమయంలో ఆమె చాలా చిన్న వయసులోనే కనిపించింది.

అప్పట్లో చిన్నారి చేసిన ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా, బాలయ్యతో ఉన్న ఆ సన్నివేశం మాత్రం ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. ఇప్పుడు ఆ చిన్నారి పెద్దయ్యింది. చిన్నతనంలో సినిమాల్లో కనిపించిన జోషిత ప్రస్తుతం తన చదువులపై దృష్టి పెట్టింది. బోయపాటి శ్రీను కుటుంబంలో సినిమాలతో అనుబంధం ఉన్న మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఆయన కుమారుడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ సినిమాలో కనిపించాడు. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమాలో చిన్ననాటి అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల్లో ఆయన కుమారుడు నటించాడు.

అలా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లోనే ఆయన పిల్లలు కూడా చిన్న వయసులో తెరపై కనిపించడం ఆసక్తికరంగా మారింది. అయితే లెజెండ్‌లో బాలయ్యను “మావయ్యా” అంటూ పిలిచిన ఆ చిన్నారి మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతూనే ఉంది. అప్పట్లో మూడు సంవత్సరాల వయసులో తెరపై కనిపించిన ఆ చిన్నారి ఇప్పుడు ఎంతగా మారిపోయిందో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.