
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాయి. ఆచితూచి కథలు ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్నాడు నాగ చైతన్య. ఈ క్రమంలోనే చివరిగా తండేల్ అనే సినిమా చేసి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగ చైతన్య తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు వృషకర్మ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

కింగ్ నాగార్జున, నాగ చైతన్యలు కలిసి నటించిన చిత్రం బంగార్రాజు. కరోనా సమయంలోనూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుందీ సినిమా.‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా రమ్మకృష్ణ నటించగా, చైతన్య సరసన కృతీ శెట్టి నటించిన విషయం తెలిసిందే.

బంగార్రాజు సినిమాలో చాలా మంది నటించారు. ఈ మూవీలో నటించిన ఓ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? బంగార్రాజు సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది ఈ చిన్నది. తాజాగా ఈ అందాల భామ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు ఎవరంటే..

బంగార్రాజులో నాగ చైతన్య ముందుగా ఈ అమ్మడితోనే పులిహోర కలుపుతాడు. ఇంత అందంగా ఉంటే దిష్టి తగులుతుంది అని అమ్మాయిని పడేస్తాడు. ఆ చిన్నది ఇప్పుడు హీరోయిన్స్ ను మించే అందంగా మారిపోయింది. బంగార్రాజు సినిమాలో క్యూట్ గా కనిపించిన ఆమె ఇప్పుడు హీరోయిన్ లుక్ తోపాటు కేక పెట్టించే అందంతో అదరగొడుతుంది.

ఆమె పేరు యష్ణ. ఈ చిన్నది సినిమాలతో పాటు పలు యాడ్స్ లోనూ నటించింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గాను చేసింది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను కవ్విస్తుంది ఈ కుర్రది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.