Director : ఆమె కళ్లను చూడటానికే హీరోయిన్‏ను చేశా.. ఇండస్ట్రీనే ఏలేసింది.. చివరకు అలా..

Updated on: Mar 28, 2026 | 9:51 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు వంశీ. గోదావరి అందాలను పల్లెటూరి స్వచ్ఛతను, స్త్రీ సౌందర్యాన్ని వెండితెరపై ఆవిష్కరించడంలో ఆయన శైలే వేరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వంశీ తన సినిమాల్లోని స్త్రీ పాత్రలు, హీరోయిన్ల ఎంపిక, భానుప్రియ కళ్ళ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

1 / 5
వంశీ సినిమాల్లో హీరోయిన్ల కళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా భానుప్రియ కళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ, తన చిన్నతనంలో తన ఊరిలో ఒక నర్సును చూసేవాడినని, ఆమె కళ్ళు చాలా అందంగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆమె మరణించిన తర్వాత, మళ్ళీ అలాంటి కళ్ళను మద్రాసులో భానుప్రియలో చూశానని, అందుకే ఆమెను తన సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకున్నానని వెల్లడించారు.

2 / 5
తన సినిమాల్లో స్త్రీ పాత్రలను ఎంతో గౌరవంగా, పద్ధతిగా చూపిస్తానని వంశీ గారు తెలిపారు. దీనికి ప్రధాన స్ఫూర్తి చలం గారి సాహిత్యమని ఆయన పేర్కొన్నారు. చలం, బుచ్చిబాబు, లత వంటి రచయితల రచనలు తనపై ఎంతో ప్రభావం చూపాయని, అందుకే తన సినిమాల్లో ఎక్కడా అశ్లీలతకు తావు లేకుండా స్త్రీ సౌందర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తానని చెప్పారు.

3 / 5
'ఏప్రిల్ 1 విడుదల' చిత్రంలోని భాగ్యం పాత్రను ఉదాహరణగా చూపిస్తూ, ఎక్కడా అసభ్యత లేకుండానే ఆ పాత్రలో ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉంటుందని వివరించారు. 'సితార' చిత్రానికి జాతీయ అవార్డు వచ్చినప్పటి అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గొప్ప అనుభూతి అని అన్నారు.

4 / 5
బాల్యంలో చలం సాహిత్యం తనపై గొప్ప ప్రభావం చూపిందని, ఆయన రచనలన్నీ పూర్తిగా చదివినట్లు వంశీ చెప్పారు. చలం, లత, బుచ్చిబాబు వంటి రచయితల ప్రభావంతోనే తాను స్త్రీని ఎప్పుడూ అసభ్యంగా చూపించలేదని,ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలోని భాగ్యం పాత్రను ఉదాహరణగా ప్రస్తావించారు.

5 / 5
గురువు భారతీరాజా గారు చెప్పిన "ప్రతి మనిషి ఒక ఆర్టిస్టే, ఆ పాత్రకు సరిపోయినప్పుడు ఎవరైనా హీరోయిన్ కావచ్చు" అనే మాటను తాను బలంగా నమ్ముతానని వంశీ తెలిపారు. తన మనసులో ఉన్న క్యారెక్టరైజేషన్‌కు తగ్గట్టుగా నటీనటులను వెతుక్కుంటానని, అలా ఎంతో మందిని తెలుగు తెరకు పరిచయం చేశానని ఆయన ఈ ఇంటర్వ్యూలో వివరించారు.

Follow Us