
చూస్తున్నారుగా విజయ్ సినిమా ఫస్ట్ లుక్. లక్షలాది మంది వెనకాల ఉంటే.. నాయకుడిగా ముందున్నారు దళపతి. అందుకే ఈయన సినిమాకు జన నాయగన్ అనే టైటిల్ ఖరారు చేసారు. ఆయనకున్న ఇమేజ్‌కు ఈ టైటిల్ పర్ఫెక్ట్ అంటున్నారు ఆడియన్స్ కూడా.

విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక వస్తున్న మొదటి సినిమా.. నటుడిగా ఆయనకు చివరి సినిమా ఇది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. సెప్టెంబర్‌లో విడుదల కానుంది జన నాయగన్.

కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం విజయ్ 200 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా భగవంత్ కేసరి రీమేక్ అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది.

పోస్టర్ చూస్తుంటే భగవంత్ కేసరితో ఏ పోలికా లేదు. పైగా దర్శకుడు వినోద్ కూడా ఇది స్ట్రెయిట్ సినిమా.. దేనికి రీమేక్ కాదని ప్రకటించారు. పైగా పక్కా రాజకీయ నేపథ్యం కనిపిస్తుంది.

విజయ్ పొలిటికల్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఈ కథ సిద్ధం చేసారు వినోద్. మరి నిజంగానే ఇది భగవంత్ కేసరి రీమేకా కాదా అని తేలాలంటే ఇంకొంత కంటెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.