
సినీ సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తమ ఫేవరెట్ హీరోయిన్స్ ఫోటోలను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ ఉంటారు. నెటిజన్స్ కూడా ఆ హీరోయిన్ ఎవరు అనేది చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇలా పజిల్స్ సాల్వ్ చేయడం అంటే చాలా మందికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్‌కు సంబందించిన చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది.

ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. కలువల్లాంటి కళ్లు, మత్తెక్కించే నవ్వు ఆమె సొంతం. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? బడా హీరో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో కాదు.. నటి మాళవిక మోహనన్. మాళవిక చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా మాళవిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాళవిక మోహనన్ 7 ఆగస్టు 1992న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి యుకె మోహనన్ బాలీవుడ్ చిత్రాలకు ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్. తల్లి వీణా మోహనన్. ఆమె ప్రస్తుతం తన స్వస్థలమైన కేరళ బియ్యూర్‌లో తన కుటుంబంతో నివసిస్తుంది. మాళవిక మోహనన్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఈ ముద్దుగుమ్మ 2013 సంవత్సరంలో “బట్టం బోలే” చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పెట్టా చిత్రంలో నటించి తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించిన నటి మాళవిక మోహనన్. ఆ తర్వాత నటుడు విజయ్ సరసన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాలో నటించి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. రీసెంట్ గా దర్శకుడు బి. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన “తంగళన్”లో మాళవిక మోహనన్ కీలక పాత్ర పోషించింది.

మాళవిక ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ చేసి మెప్పించింది. ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. కానీ తమిళ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.