Cinema : వామ్మో.. ఒక్కో ట్విస్టుతో వణికిస్తున్న తెలుగు హారర్ సినిమా.. ఓటీటీలో సంచలన రెస్పాన్స్.. ఒంటరిగా చూసే ధైర్యం ఉందా?

Updated on: Oct 25, 2026 | 8:51 PM

ప్రముఖ ఓటీటీ వేదిక 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. పాతకాలపు రాజభవనంలో అనుకోకుండా తెరిచిన ఒక రహస్య పెట్టె వల్ల ఓ యువతిని దుష్టశక్తి ఆవహించడం, ఆ తర్వాత ఆమె చేసే భయానక చేష్టలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. రొటీన్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త కాన్సెప్ట్‌తో వణికిస్తున్న ఈ హారర్ మూవీ ప్రస్తుతం ఆహాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

1 / 5
సినిమా ప్రియులను ఏమాత్రం ఆలోచింపజేయకుండా భయపెట్టే జానర్ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అనే చెప్పాలి. భాషతో సంబంధం లేకుండా బలమైన కంటెంట్ ఉంటే సరికొత్త ప్రయోగానికి ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. ఈ కోవలోనే థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఐఎమ్‌డీబీలో ఏకంగా 7.7 రేటింగ్‌ను సొంతం చేసుకున్న సరికొత్త భయానక చిత్రం 'దహాన్: ది ఈవిల్ వితిన్'.

2 / 5
ఒరిజినల్‌గా ఒడియా భాషలో రూపొందిన ఈ సినిమా, ప్రస్తుతం డిజిటల్ మాధ్యమం ద్వారా తెలుగు ప్రేక్షకులను భయపెడుతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్‌లో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా కథ మొత్తం 'సింగ్ దేవ్' అనే ఒక పాతకాలపు, పాడుబడిన రాజభవనం చుట్టూ తిరుగుతుంది.

3 / 5
 ఆ ఇంట్లో ఏదో శక్తి ఉందని, అటువైపు వెళ్తే ప్రాణాలకే ప్రమాదమని స్థానికులు ఎప్పుడూ భయపడుతుంటారు. అయితే, కొన్ని అనూహ్య పరిస్థితుల కారణంగా ఒక యువతి తన అక్క, తమ్ముడితో కలిసి ఆ భవనంలోకి నివాసానికి వస్తుంది. ఆ ఇంట్లో దెయ్యం ఉందనే విషయాన్ని గ్రహించలేక వారు అనుకోకుండా ఒక రహస్యమైన పురాతన పెట్టెను తెరుస్తారు. ఆ క్షణం నుంచే ఆ కుటుంబం జీవితం పూర్తిగా తలకిందులవుతుంది. ఆ పెట్టె తెరిచిన క్షణం నుంచి అందులోంచి బయటపడిన ఒక ప్రాచీన దుష్టశక్తి ఆ యువతిని పూర్తిగా ఆవహిస్తుంది.

4 / 5
అప్పటి వరకు సాధారణంగా ఉన్న ఆ యువతి ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయి, విచిత్రంగా ప్రవర్తించడం, మనుషులను పీక్కుతినడం లాంటి అత్యంత భయానక, జుగుప్సాకరమైన పనులు చేయడం ప్రారంభిస్తుంది. తన చెల్లెలిని ఆ దుష్టశక్తి బారి నుంచి రక్షించుకోవడానికి అక్కా తమ్ముడు పడే ఆవేదన, ఒక ఫాదర్ (పాస్టర్) సహాయంతో నిర్వహించే ఎక్సార్సిజమ్ (దెయ్యాన్ని వదిలించే ప్రక్రియ) సన్నివేశాలు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి.

5 / 5
 దర్శకుడు అనుపమ్ పట్నాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రొటీన్ హారర్ సినిమాలకు భిన్నంగా ఇందులో వాడిన జంప్ స్కేర్స్, డార్క్ థీమ్, , సరికొత్త ఇజ్రాయెలీ దెయ్యం కాన్సెప్ట్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఔరోశిఖా మిశ్రా, బర్షా పట్నాయక్, సామ్రాట్ మహాపాత్ర, జయప్రకాష్ దాస్ తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ముఖ్యంగా దెయ్యం పట్టిన యువతిగా నటించిన నటి అభినయం సినిమా చూస్తున్నంతసేపు వెన్నులో వణుకు పుట్టిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us