అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాని నిర్మాతగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన కోర్టు మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇందులో పేదింటి అమ్మాయిగా శ్రీదేవి జాబిలి పాత్రలో నటించి తన పాత్రకు ప్రాణం పోసిందనే చెప్పాలి.
దీంతో శ్రీదేవి నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయితుండటంతో చాలా మంది ఎవరు ఈ బ్యూటీ అంటూ నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే కోర్టు మూవీలో జాబిల్లి పాత్రలో మెరిసిన చిన్నది ఏపీలోని కాకినాడకు చెందిన తెలుగు అమ్మాయినే ఈ ముద్దుగుమ్మనంట.
దీంతో ఈ బ్యూటీ గురించి నెట్టింట్లో తెగ సెర్చ్ చేయగా జాబిలి పాత ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో బ్యూటీ అందానికి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ అయిపోతున్నారు. ఈ మూవీతోనే ఈ చిన్నది కుర్రకారు క్రష్ అయ్యిపోయింది.
శ్రీదేవి పాత ఫొటోస్ చూసిన నెటిజన్స్ తన అందానికి మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఈ అమ్మడు తప్పకుండా స్టార్ హీరోయిన్ అవ్వడం కావడం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఇంకెందుకు ఆలస్యం కోర్టు మూవీలో జాబిలిగా కుర్రకారు మనసు దోచేసిన ఈ ముద్దుగుమ్మ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి.