Chiranjeevi : ఏఐ దుర్వినియోగాన్ని కట్టడి చేయండి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చిరంజీవి వినతి

Updated on: Nov 16, 2026 | 2:19 PM

సోషల్ మీడియా, డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏఐ (AI) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఇదే సాంకేతికతను కొందరు దుర్వినియోగం చేస్తూ సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేయడం, డీప్‌ఫేక్ కంటెంట్‌ను సృష్టించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు .

1 / 5
 సోషల్ మీడియా, డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏఐ (AI) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఇదే సాంకేతికతను కొందరు దుర్వినియోగం చేస్తూ సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేయడం, డీప్‌ఫేక్ కంటెంట్‌ను సృష్టించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు.

2 / 5
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి తన వంతుగా విజ్ఞప్తి చేశారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించిన చిరంజీవి.. ఆయన సూచన మేరకు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వ్యక్తుల గుర్తింపును దుర్వినియోగం చేయడం, నకిలీ వీడియోలు సృష్టించడం చేస్తున్నారని తెలిపారు. 

3 / 5
డీప్‌ఫేక్‌ల ద్వారా వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించడం వంటి సమస్యలపై అందులో ప్రధానంగా ప్రస్తావించారు చిరంజీవి. ముఖ్యంగా సినీ కళాకారులు, ఇతర ప్రముఖుల డిజిటల్ గుర్తింపు, వ్యక్తిగత గౌరవం, సృజనాత్మక హక్కులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చిరంజీవి తన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సమస్యను కేవలం సినీ పరిశ్రమకు సంబంధించిన అంశంగా కాకుండా.. ప్రతి పౌరుడి భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వాన్ని చిరంజీవి కోరారు.

4 / 5
ఈ వినతిపత్రం కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో పాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు చిరంజీవి వెల్లడించారు.ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న మెగాస్టార్.. తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కళాకారుల గౌరవం, గుర్తింపు, సృజనాత్మక హక్కులను కాపాడటంతో పాటు ప్రతి పౌరుడి భద్రతను పరిరక్షించడం అందరి బాధ్యత అని అభిప్రాయపడ్డారు.

5 / 5
సాంకేతికత అనేది సృజనాత్మకతను మరింత పెంచేందుకు ఉపయోగపడాలే తప్ప.. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించే సాధనంగా మారకూడదని చిరంజీవి స్పష్టం చేశారు. ఏఐ, డీప్‌ఫేక్‌ల దుర్వినియోగంపై ఆయన స్పందించిన తీరు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమస్యకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us