
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం అభిమానులకు ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా ప్రత్యేక సందర్భాల్లో నటీనటులు పంచుకునే అరుదైన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా బాలల దినోత్సవం సందర్భంగా ఓ బుల్లితెర నటి తన చిన్ననాటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఆ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా?

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఓ ప్రముఖ సీరియల్లో కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఆమె మరెవరో కాదు.. గాయత్రి సింహాద్రి. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ మా ఛానెల్లో ప్రసారమవుతున్న కార్తీకదీపం 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో సంచలన విజయాన్ని అందుకున్న కార్తీకదీపం సీరియల్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ సెకండ్ పార్ట్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్లో కార్తీక్, దీప పాత్రలతో పాటు జ్యోత్స్న క్యారెక్టర్‌కు కూడా మంచి క్రేజ్ ఉంది.

ఈ పాత్రలో గాయత్రి సింహాద్రి తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కార్తీకదీపం 2లో జ్యోత్స్న పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుంది. కార్తీక్‌ను దక్కించుకోవాలనే పట్టుదలతో ఆమె చేసే పనులు కథలో ఆసక్తిని పెంచుతుంటాయి. విలన్ తరహా పాత్ర అయినప్పటికీ తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది గాయత్రి. ఈ సీరియల్‌తో ఆమెకు వచ్చిన పాపులారిటీ మరింత పెరిగిందని చెప్పవచ్చు. గాయత్రి సింహాద్రికి కార్తీకదీపం 2 కంటే ముందే బుల్లితెరపై పరిచయం ఉంది.

త్రినయిని, పల్లకిలో పెళ్లికూతురు వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. అయితే కార్తీకదీపం 2లో జ్యోత్స్న పాత్ర ఆమె కెరీర్‌కు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. హీరోయిన్గా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమెకు ప్రస్తుతం విభిన్నమైన పాత్రలు లభిస్తున్నాయి. నటన రంగంలోకి రాకముందు గాయత్రి సింహాద్రి తన కెరీర్‌ను యాంకర్‌గా ప్రారంభించింది. విశాఖపట్నంలోని స్థానిక టీవీ ఛానెల్స్‌తో పాటు పలు ప్రాంతీయ కార్యక్రమాల్లో హోస్ట్‌గా వ్యవహరించింది. తన యాంకరింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత హైదరాబాద్ టెలివిజన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా వంటి ప్రముఖ ఛానెల్స్‌లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరించింది. ఒకవైపు సీరియల్స్‌తో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ గాయత్రి యాక్టివ్‌గా ఉంటుంది. తన షూటింగ్ విశేషాలు, వ్యక్తిగత ఫొటోలు, గ్లామరస్ లుక్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. దీంతో ఆమె పోస్టులకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా బాలల దినోత్సవం సందర్భంగా షేర్ చేసిన చిన్ననాటి ఫొటో కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం జ్యోత్స్నగా బుల్లితెరపై సందడి చేస్తున్న గాయత్రి సింహాద్రి.. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.