Tollywood : చేసింది నాలుగే సినిమాలు.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన హీరోయిన్.. రీఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ..

Updated on: Nov 14, 2026 | 1:29 PM

ప్రస్తుతం ఈ హీరోయిన్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతూనే, సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్‌ను ఫిదా చేస్తోంది. అప్పట్లో ఆమె తొలి సినిమా అనుభవాలు, నాటి షూటింగ్ విశేషాలు మరోసారి నెట్టింట చర్చకు వచ్చాయి. ఆ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అభిమానులు ఆ ఫోటోలను లైక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?

1 / 5
సినిమా పరిశ్రమకు చెందిన సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు, అరుదైన చిత్రాలు ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తమ అభిమాన నటీనటులు ఇండస్ట్రీలోకి రాకముందు ఎలా ఉండేవారు, చిన్నతనంలో వారి లుక్స్ ఎలా ఉండేవి అని తెలుసుకోవడానికి సినీ ప్రేమికులు ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. తాజాగా టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా రాణిస్తున్న ఒక ప్రముఖ నటి చిన్ననాటి థ్రోబ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలను చూసి నెటిజన్లు ఆమెను గుర్తుపట్టేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.

2 / 5
ఆమె మరెవరో కాదు మలయాళీ కుట్టి భావన.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆమె పేరు చెప్తే  తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా 'ఒంటరి'. 2008లో గోపీచంద్ హీరోగా వచ్చిన ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. మలయాళంలో కెరీర్ మొదలుపెట్టిన దాదాపు ఐదారేళ్ల తర్వాత ఆమె తెలుగు తెరకు వచ్చారు. అయితే టాలీవుడ్‌లో ఆమె చేసింది కేవలం నాలుగు సినిమాలే. రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో మలయాళం, తమిళం, కన్నడ చిత్రాల్లో ఎక్కువగా నటించారు.

3 / 5
భావన అసలు పేరు కార్తిక మీనన్. ఆమె 1986 జూన్ 6న కేరళలోని త్రిసూర్‌లో జన్మించారు. పదహారేళ్ల వయసులోనే 2002లో 'నమ్మల్' అనే మలయాళ చిత్రంతో నటిగా అడుగుపెట్టారు. మొదటి సినిమాకే ఆమెకు కేరళ రాష్ట్ర ఫిల్మ్ అవార్డుల్లో ప్రత్యేక ప్రస్తావన లభించింది. 2005లో 'దైవనామత్తిల్' చిత్రానికి కేరళ రాష్ట్ర ఉత్తమ ద్వితీయ నటి అవార్డు అందుకున్నారు. 2006లో 'చిత్తిరం పేసుతడి' చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి (తమిళం) అవార్డు గెలుచుకున్నారు. తెలుగులో భావన తొలి సినిమా 'ఒంటరి'. ఆ తర్వాత నితిన్ సరసన 'హీరో' చిత్రంలో కనిపించారు.

4 / 5
శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'మహాత్మ' చిత్రంతో ఆమెకు కొంత గుర్తింపు వచ్చింది. అయినా టాలీవుడ్ ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. తమిళం, కన్నడ చిత్రాల్లో అవకాశాలు రావడంతో తెలుగు సినిమాలకు దూరమయ్యారు. రవితేజ నటించిన 'నిప్పు'లో ఆమె చిన్న పాత్రలో కనిపించారు. అదే ఆమె చివరి తెలుగు సినిమా. భావన వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది. 2012లో కన్నడ చిత్రం 'రోమియో'లో ఆమె నటించారు. ఆ చిత్ర నిర్మాత నవీన్‌తో అప్పుడే పరిచయం ఏర్పడింది. ఆరేళ్ల పాటు స్నేహంగా, ప్రేమలో ఉన్న ఈ జంట 2017 మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు.

5 / 5
2018 జనవరి 22న త్రిసూర్‌లో సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి భావన భర్తతో కలిసి బెంగళూరులో స్థిరపడ్డారు. 2023లో వచ్చిన మలయాళ చిత్రం 'నిటిక్కక్కొరు ప్రేమందార్న్' తర్వాత ఆమె రెహమాన్‌తో కలిసి 'అనోమీ: ది ఈక్వేషన్ ఆఫ్ డెత్' అనే థ్రిల్లర్‌లో నటించారు. తెలుగులో పెద్దగా కనిపించకపోయినా, భావన ఇప్పటికీ మలయాళం, కన్నడ, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలిగానే ఉన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us